శనివారం, నవంబర్ 17, 2018

దొరలనీకు కనులనీరు...

నాలుగు స్తంభాలాటలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : నాలుగు స్తంభాలాట (1982)
సంగీతం : రాజన్-నాగేంద్ర
రచన : వేటూరి
గానం : పి.సుశీల

దొరలనీకు కనులనీరు దొరలదీలోకం
మగదొరలదీలోకం
కనులలోనే దాచుకోవే కడలిలా శోకం
కన్నెపడుచులా శోకం

నాల్గు దిక్కుల నడుమ పుట్టి నలిగిపోయే జగతిలో
నాల్గు దిక్కుల నడుమ పుట్టి నలిగిపోయే జగతిలో
నాలుగు పాదాల ధర్మం నడువలేని ప్రగతిలో
నాలుగు స్తంభాల ఆట ఆడబ్రతుకు తెలుసుకో

దొరలనీకు కనులనీరు దొరలదీలోకం
కనులలోనే దాచుకోవే కడలిలా శోకం

వెన్నెలే కరువైననాడు నింగినిండా చుక్కలే
వెన్నెలే కరువైననాడు నింగినిండా చుక్కలే
కన్నెగానే తల్లివైతే కంటినిండా చుక్కలే
నాల్గు మొగముల బ్రహ్మరాసిన
ఖర్మనీకిది తెలుసుకో

దొరలనీకు కనులనీరు దొరలదీలోకం
కనులలోనే దాచుకోవే కడలిలా శోకం

కలవని తీరాల నడుమ గంగలాగా కదిలిపో
కలవని తీరాల నడుమ గంగలాగా కదిలిపో
అమ్మగా ఒక జన్మనిచ్చి అవని నీవై మిగిలిపో
నాలుగు వేదాలసారం అనుభవంలో తెలుసుకో

దొరలనీకు కనులనీరు దొరలదీలోకం
మగదొరలదీలోకం
కనులలోనే దాచుకోవే కడలిలా శోకం
కన్నెపడుచులా శోకం

4 comments:

"దొరలనీకు కనులనీరు దొరలదీలోకం" అన్న పల్లవిలో వేటూరిగారు "దొర" అన్న పదాన్ని గమ్మత్తుగా వాడారు. ఆయన పాళీ పదును ఇక్కడ మాటమాటలో కనిపిస్తుంది. జంధ్యాలగారి దర్శకత్వ ప్రతిభకు ఈ సన్నివేశ కల్పన ఒక గొప్ప తార్కాణం. "వెన్నెలే కరువైననాడు నింగినిండా చుక్కలే" అన్న చరణంలో ఆ భావాన్ని సకారాత్మకంగా కాకుండా నకారాత్మక పోలికతో కన్నీళ్ళకి ముడిపెట్టడం కూడా కవి విద్వత్తుకు నిదర్శనం. మంచి హృద్యమయిన పాటను పంచుకున్నందుకు ధన్యవాదములు.

పాటగురించి చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు భవాని ప్రసాద్ గారు..

మనసుని తడి చేసే పాట..

అవును శాంతి గారు.. థాంక్స్ ఫర్ ద కామెంట్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.