ఆదివారం, నవంబర్ 04, 2018

కలుసుకున్నా గుబులాయె...

అక్బర్ సలీం అనార్కలి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అక్బర్ సలీం అనార్కలి (1978)
సంగీతం : సి.రామచంద్ర
సాహిత్యం : సినారె
గానం : మహమ్మద్ రఫీ, సుశీల

కలుసుకున్నా గుబులాయె
కలవకున్నా దిగులాయె
ఏమాయె నాలో ఏమాయె

కలుసుకున్నా గుబులాయె
కలవకున్నా దిగులాయె
ఏమాయె నాలో ఏమాయె

కలుసుకుంటే క్షణమాయె
కలవకుంటే యుగమాయె
ఏమాయె నాలో ఏమాయె

మన్నించు షహజాదా మనసిచ్చె నిరుపేద
మన్నించు షహజాదా మనసిచ్చె నిరుపేద
గులాబీపువ్వు ఎక్కడ దానిమ్మమొగ్గ ఎక్కడ 
గులాబీపువ్వు ఎక్కడ దానిమ్మమొగ్గ ఎక్కడ
గులాబీ ఐనా అనారైనా మొలిచేది నేలపైన
ఆ... నేలలాంటిదే ప్రేమ
ఆ... నేలలాంటిదే ప్రేమ
దానికి అంతరాలే లేవు సుమా.. లేవు సుమా

కలుసుకున్నా గుబులాయె
కలవకున్నా దిగులాయె
ఏమాయె నాలో ఏమాయె

తులదూచలేనిది విలువైన మీ ప్రణయం
తులదూచలేనిది విలువైన మీ ప్రణయం
బానిసను ప్రేయసిగా వలచింది మీ హృదయం 
బానిసను ప్రేయసిగా వలచింది మీ హృదయం
జమానా కాదని అంటున్నా
హుకూమత్ కత్తులు దూస్తున్నా
జమానా కాదని అంటున్నా
హుకూమత్ కత్తులు దూస్తున్నా
నా... మదినేలే దొరసానివీ
నా... మదినేలే దొరసానివీ
ఇక భరతావనికే రాణివి... మహారాణివి
 
కలుసుకున్నా గుబులాయె
కలవకున్నా దిగులాయె
ఏమాయె నాలో ఏమాయె
 
పొడిచే పొద్దును పొంగే కడలిని నిలదీసేదెవరు
వలచిన జంటల కలిసిన ఆత్మల విడదీసేదెవరు
అనార్ సలీముల ప్రేమగాథ
అమరగాథయేలే
అమరగాథయేలే
అమరగాథయేలే 


2 comments:

రఫిగారి గొంతులో ఈ పాటలు వింటుంటే చాల తమాషా ఐన అనుభూతి..

హహహ అవునండీ.. ఆయన తెలుగు చాలా మంది నచ్చదు అంటారు కానీ నాకు అదే చాలా చిత్రంగా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంటుంది.. పైగా ఆ పాత్రలకు కూడా సరిగా సరిపోతుంది అనిపిస్తుంది..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.