సీతారాములు చిత్రంలోని ఒక మధుర గీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : సీతారాములు (1980)
సంగీతం : సత్యం
సాహిత్యం : దాసరి నారాయణ రావు
గానం : బాలు, సుశీల
తొలిసంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో
తెలవారే తూరుపులో వినిపించే రాగం భూపాలం
యెగిరొచ్చే కెరటం సింధూరం
తొలిసంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో
తెలవారే తూరుపులో వినిపించే రాగం భూపాలం
యెగిరొచ్చే కెరటం సింధూరం
జీవితమే రంగుల వలయం
దానికి ఆరంభం సూర్యుని ఉదయం
గడిచే ప్రతి నిమిషం ఎదిగే ప్రతిబింబం
వెదికే ప్రతి ఉదయం దొరికే ఒక హృదయం
ఆ హృదయం సంధ్యా రాగం మేలుకొలిపే అనురాగం
తొలిసంధ్య వేళలో...
సాగరమే పొంగుల నిలయం
దానికి ఆలయం సంధ్యా సమయం
వచ్చే ప్రతి కెరటం చేరదు అది తీరం
లేచే ప్రతి కెరటం అది అంటదు ఆకాశం
ఆ ఆకాశంలో ఒక మేఘం మేలుకొలిపే అనురాగం
తొలిసంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో
తెలవారే తూరుపులో వినిపించే రాగం భూపాలం
యెగిరొచ్చే కెరటం సింధూరం
సంగీతం : సత్యం
సాహిత్యం : దాసరి నారాయణ రావు
గానం : బాలు, సుశీల
తొలిసంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో
తెలవారే తూరుపులో వినిపించే రాగం భూపాలం
యెగిరొచ్చే కెరటం సింధూరం
తొలిసంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో
తెలవారే తూరుపులో వినిపించే రాగం భూపాలం
యెగిరొచ్చే కెరటం సింధూరం
జీవితమే రంగుల వలయం
దానికి ఆరంభం సూర్యుని ఉదయం
గడిచే ప్రతి నిమిషం ఎదిగే ప్రతిబింబం
వెదికే ప్రతి ఉదయం దొరికే ఒక హృదయం
ఆ హృదయం సంధ్యా రాగం మేలుకొలిపే అనురాగం
తొలిసంధ్య వేళలో...
సాగరమే పొంగుల నిలయం
దానికి ఆలయం సంధ్యా సమయం
వచ్చే ప్రతి కెరటం చేరదు అది తీరం
లేచే ప్రతి కెరటం అది అంటదు ఆకాశం
ఆ ఆకాశంలో ఒక మేఘం మేలుకొలిపే అనురాగం
తొలిసంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో
తెలవారే తూరుపులో వినిపించే రాగం భూపాలం
యెగిరొచ్చే కెరటం సింధూరం
4 comments:
యెవ్వర్ గ్రీన్ సాంగ్..
అవును శాంతి గారు.. థాంక్స్ ఫర్ ద కామెంట్..
బాగుంది
థాంక్స్ ప్రవీణ్ కుమార్ గారు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.