రాజు రాణి జాకీ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : రాజు రాణి జాకి (1983)
సంగీతం : రాజన్-నాగేద్ర
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, సుశీల
ఆకాశవీధులలోన వినిపించింది ఓ మౌనగీతం
ఆ గీతమంతా పలికించే అనురాగాలు మనకోసం
ఆకాశవీధులలోన వినిపించింది ఓ మౌనగీతం
ఆ గీతమంతా పలికించే అనురాగాలు మనకోసం
ఆకాశవీధులలోన వినిపించింది ఓ మౌనగీతం
మందార మకరందాలే కురిసింది సుందరహాసం
మందార మకరందాలే కురిసింది సుందరహాసం
మమతలే పరిమళమై హృదయాలు పరవశమై
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
శృంగార సుమభాణాలే విసిరింది సంధ్యారాగం
శృంగార సుమభాణాలే విసిరింది సంధ్యారాగం
ప్రణయమే ప్రణవమనే అందాల అనుభవమే..ఏ
ఈ చైత్రవేళలలోన ఆలాపనై
ఆకాశవీధులలోన వినిపించింది ఓ మౌనగీతం
నా లేత యవ్వనమల్లె విరిసింది మల్లెలమాసం
నా లేత యవ్వనమల్లె విరిసింది మల్లెలమాసం
మనసులే తనువులుగా మధుమాస కోకిలలై
ఆ ఆ ఆ ఆ హ్హా ఆ ఆ ఆ ఓ ఓ ఓ
నా కొంటె కోరికలేవొ కొసరింది తుమ్మెద నాదం
నా కొంటె కోరికలేవొ కొసరింది తుమ్మెద నాదం
పరువమే స్వరములుగా సనజాజి సంకెలలై
హేమంత రాత్రులలోన..హిమవీణలై
ఆకాశవీధులలోన వినిపించింది ఓ మౌనగీతం
ఆ గీతమంతా పలికించే అనురాగాలు మనకోసం
ఆకాశవీధులలోన వినిపించింది ఓ మౌనగీతం
4 comments:
నైస్ సాంగ్..బ్యూటిఫుల్ పిక్..
థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..
బాగుంది
థాంక్స్ ప్రవీణ్ కుమార్ గారు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.