బాలల దినోత్సవం సంధర్బంగా చిన్నారులకు శుభాకాంక్షలు మరియూ దీవెనలు అందజేస్తూ మేము చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : మేము (2016)
సంగీతం : అరోల్ కొరెల్లి
సాహిత్యం : వెన్నెలకంటి
గానం : ఆనంద్
తంతంతారరంపంపంపం
తంతంతారరంపంప
తారెరారేరారేరా..
తంతంలోని తంతంతంతం
హృదయం పాడె సంగీతం
నిన్ను చేరినదా
కష్టాలు లేని ఏ పిల్లలు లేరులే
బొమ్మల్లే బతికే వారు పిల్లలు కారులే
దిగులింక ఏలా మనమల్లరి పిల్లలై
మేఘాలు దాటి ఎగిరేము గువ్వలై
తంతంతారరంపంపంపం
తంతంతారరంపంప
తారెరారేరారేరా..
తంతంలోని తంతంతంతం
హృదయం పాడె సంగీతం
నిన్ను చేరినదా
తల్లి కడుపులో ఉన్నాం
కాళ్ళు చేతులాడించాం
ఈ నేలపైకొచ్చీ
మౌనంగా ఎందుకున్నాం
తోడుంది నీకు ఈకాలమే
నువ్వు సాగిముందుకే పో
ఆ మబ్బుల్ని నీవడిగావుగా
నీ రెక్కల్లే నే వస్తానురా నీకై
తంతంతారరంపంపంపం
తంతంతారరంపంప
తారెరారేరారేరా..
తంతంలోని తంతంతంతం
హృదయం పాడె సంగీతం
నిన్ను చేరినదా
ఆగాజుపెట్టెలలో
జీవించు చేపలకు
కడలినీదు అనుభవమే
నేర్పించ మరచాము
ఆకాశమే నీదైనదో
హద్దేది లేదు నువ్వుపో
నువ్వు అరవిచ్చు పువ్వేనురా
నువ్వు పాపైతే నే రెప్పేనురా ఇక
తంతంతారరంపంపంపం
తంతంతారరంపంప
తారెరారేరారేరా..
తంతంలోని తంతంతంతం
హృదయం పాడె సంగీతం
నిన్ను చేరినదా
2 comments:
పిక్ అత్యాద్భుతంగా ఉంది..
థాంక్స్ శాంతిగారు.. ఈ పిక్ సెలెక్ట్ చేసిచ్చిన నా నేస్తానికే దక్కుతాయి మీ పొగడ్తలు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.