శుక్రవారం, జులై 13, 2018

నీ జతలేక...

ప్రేమ పావురాలు చిత్రంలోని ఒక చక్కని మెలోడీని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ప్రేమ పావురాలు(మైనే ప్యార్ కియా) (1989)
సంగీతం : రామ్ లక్ష్మణ్     
సాహిత్యం : రాజశ్రీ    
గానం : చిత్ర  

ఓహో... లలలలా... 
ఊహూహూ.. ఓహోహో...
నీ జతలేక పిచ్చిది కాదా మనసంటా
నీ జతలేక పిచ్చిది కాదా మనసంటా
ఆ మనసేమో నా మాటే వినదంటా
ఆ మనసేమో నా మాటే వినదంటా
కదిలించేను కరిగించేను నన్నంటా
 
నా మనసేమో నా మాటే వినదంటా
నా మనసేమో నా మాటే వినదంటా

ఉన్నది ఒకటే మధిలో కోరిక
ప్రియసన్నిధి కావాలి 
ఓఓహో..ఓహోహో..
ఉన్నది ఒకటే మధిలో కోరిక
ప్రియసన్నిధి కావాలి 
నాకన్నులలో వెలుగై ఎపుడు
నిండుగ నువు నిండాలి
అంతకు మించిన
వరములు ఏవీ వలదంటా

నా మనసేమో నా మాటే వినదంటా
నా మనసేమో నా మాటే వినదంటా

ఓహో.... ఓహో... హో...
లలలలల...అలలలల..
ఓహో.... ఓహో... హో...
లలలలల...అలలలల..

చీరగ నిన్నే కట్టాలీ అని
మనసే నాతో తెలిపే
ఓఓహో..ఓహోహో..
చీరగ నిన్నే కట్టాలీ అని
మనసే నాతో తెలిపే
నింగిని నీతో కలిసెగరాలని
కదిలే మదిలో తలపే
ఉన్నవి ఎన్నో
తియ్యని వాంఛలు నాకంటా

నా మనసేమో నా మాటే వినదంటా
నా మనసేమో నా మాటే వినదంటా

2 comments:

హిందీ డబ్బింగ్ సాంగ్స్ లో నాకు తెలిసి అందరూ యెంజాయ్ చేసినది ప్రేమ పావురాలు సాంగ్సేనేమో..

అవును శాంతి గారు అప్పటినుండే హిందీ డబ్బింగ్ ఎక్కువయ్యాయేమో అని కూడా నాకు అనిపిస్తుంటుంది. థాంక్స్ ఫర్ యువర్ కామెంట్..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.