ఆదివారం, జూన్ 23, 2019

తెల్లమబ్బు తేరు మీద...

చిన్నోడు పెద్దోడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : చిన్నోడు పెద్దోడు (1988)
సంగీతం : ఎస్.పి.బాలు
సాహిత్యం : వెన్నెలకంటి
గానం : ఎస్.పి.బాలు, జానకి

ఆ ఆ ఆ ఆ.... ఆ ఆ ఆ ఆ....

తెల్లమబ్బు తేరు మీద
ఇలకు దిగిన వెండి చందమామా
ఓ భామా...  నువ్వే నా ప్రేమా

రెక్క విసిరి ఊహలన్ని
రెపరెపలాడేటి గగన సీమా
కలిసేమా... ఒకటై ఒదిగేమా


యుగాలు వేచినా నిరీక్షలోనా
ఎడారి గుండెలో వరాల వానా
పదాలకందనీ ఎదంట నువ్వు
పదాల వాలినా సుమాన్ని నేను


వయసే తపించీ... వలపే జపించీ
కలలే ఫలించీ... కలిపే విరించి
కుందనాల బొమ్మ... కనువిందు చేసెనమ్మా
కోరివచ్చె కొమ్మ... దరిజేరి ఏలుకొమ్మా
ఆరుౠతువులేకమైన
ఆమని మనదే సుమా

రెక్క విసిరి ఊహలన్ని
రెపరెపలాడేటి గగన సీమా
కలిసేమా...
ఒకటై ఒదిగేమా...

గులాబి సిగ్గులా నివాళులీనా
వరించి నిన్ను నే తరించిపోనా

విరాళి సైపని  వియోగ వీణ
సరాగమైనదీ స్వరాలలోన
చూపుల మందారం పాపట సిందూరం
కులుకే సింగారం పలుకే బంగారం
చిరునవ్వుల సారం చిగురించిన సంసారం
చెలి సొగసుల గారం చెలరేగిన శృంగారం
కలసిన హృదయాలలోన
వెలసిన రసమందిరం


తెల్లమబ్బు తేరు మీద
ఇలకు దిగిన వెండి చందమామా
ఓ భామా...  నువ్వే నా ప్రేమా

రెక్క విసిరి ఊహలన్ని
రెపరెపలాడేటి గగన సీమా
కలిసేమా...  ఒకటై ఒదిగేమా

 

2 comments:

ఈ మూవీలో పాటలన్నీ బావుంటాయి..

బాలు గారి మ్యూజిక్ కదండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.