శుక్రవారం, మే 31, 2019

పదర పదర పదరా...

మహర్షి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మహర్షి (2019)
సంగీతం : దేవీశ్రీప్రసాద్
సాహిత్యం : శ్రీమణి
గానం : శంకర్ మహదేవన్

భళ్ళుమంటు నింగి ఒళ్ళు విరిగెను గడ్డి పరకతోన
ఎడారి కళ్ళు తెరచుకున్న వేళన చినుకు పూలవాన
సముద్రమెంత దాహమేస్తె వెతికెనొ ఊటబావినే
శిరస్సు వంచి శిఖరమంచు ముద్దిడె మట్టినేలనే

పదర పదర పదరా
నీ అడుగుకి పదును పెట్టి పదరా
ఈ అడవిని చదును చెయ్యి మరి
వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా
పదర పదర పదరా
ఈ పుడమిని అడిగిచూడు పదరా
ఈ గెలుపను మలుపు ఎక్కడను
ప్రశ్నలన్నిటికి సమాధానమిదిరా

నీ కథ ఇదిరా నీ మొదలిదిరా
ఈ పథమున మొదటడుగేయి రా
నీ తరమిదిరా అనితరమిదిరా
అని చాటెయ్ రా

పదర పదర పదరా
నీ అడుగుకి పదును పెట్టి పదరా
ఈ అడవిని చదును చెయ్యి మరి
వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా
పదర పదర పదరా
ఈ పుడమిని అడిగిచూడు పదరా
ఈ గెలుపను మలుపు ఎక్కడను
ప్రశ్నలన్నిటికి సమాధానమిదిరా

ఓ.. భళ్ళుమంటు నింగి ఒళ్ళు విరిగెను గడ్డి పరకతోన
ఎడారి కళ్ళు తెరచుకున్న వేళన చినుకు పూలవాన
సముద్రమెంత దాహమేస్తె వెతికెనొ ఊటబావినే
శిరస్సు వంచి శిఖరమంచు ముద్దిడె మట్టినేలనే

కదిలే ఈ కాలం తన రగిలే వేదనకి
బదులల్లే విసిరిన ఆశల బాణం నువ్వేరా
పగిలే ఇల హృదయం, తన ఎదలో రోదనకి,
వరమల్లే దొరికిన ఆఖరిసాయం నువ్వేరా
కనురెప్పలలో తడి ఎందుకని, తననడిగే వాడే లేక,
విలపించేటి ఈ భూమి ఒడి చిగురించేలా

పదర పదర పదరా
ఈ హలమును భుజముకెత్తి పదరా
ఈ నేలను ఎదకు హత్తుకుని
మొలకలెత్తమని, పిలుపునిచ్చి పదరా

పదర పదర పదరా
ఈ వెలుగను పలుగు దించి పదరా
పగుళ్లతొ పనికిరానిదను బ్రతుకు
భూములిక మెతుకులిచ్చు కదరా

నీలో ఈ చలనం మరి కాదా సంచలనం
చినుకల్లే మొదలై ఉప్పెన కాదా ఈ కధనం
నీలో ఈ జడికి చెలరేగే అలజడికి
గెలుపల్లే మొదలై చరితగ మారే నీ పయనం
నీ ఆశయమే తమ ఆశ అని, తమకోసమని తెలిసాక,
నువు లక్ష్యమని తమ రక్షవని నినదించేలా

పదర పదర పదరా
నీ గతముకు కొత్త జననమిదిరా
నీ ఎత్తుకు తగిన లోతు ఇది
తొలి పునాది గది తలుపు తెరిచి పదరా
పదర పదర పదరా
ప్రతొక్కరి కథవు నువ్వు కదరా
నీ ఒరవడి భవిత కలల ఒడి
బ్రతుకు సాధ్యపడు సాగుబడికి బడిరా

తనని తాను తెలుసుకున్న హలముకు పొలముతో ప్రయాణం
తనలోని ఋషిని వెలికితీయు మనిషికి లేదు ఏ ప్రమాణం
ఉషస్సు ఎంత ఊపిరిచ్చి పెంచిన కాంతిచుక్కవో
తరాల వెలితి వెతికి తీర్చవచ్చిన వెలుగురేఖవో

 

2 comments:

డ్యూ రెస్పెక్ట్స్ టు మహేష్ బాబు ఫాన్స్..మరీ యూనివర్సిటీ లో లెక్చరర్ యేమౌదామనుకుంటున్నావంటే..ఈ ప్రపంచాన్ని యేలేద్దామనుకుంటున్నా లాంటివి కొన్ని అతిగా ఉన్నాయి..యెవైటింగ్ ఫర్ అనిల్ రావిపూడి ఫిల్మ్..కొత్త యాంగిల్ లో మహేష్ బాబుని చూడాలని ఆశ..

థాంక్స్ ఫర్ ది కామెంట్ శాంతి గారు...

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.