శనివారం, మే 11, 2019

సంపద్దోయ్ నన్నే...

సెవెన్ చిత్రంలోని ఒక సరదా ఐన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సెవెన్ (2019)
సంగీతం : చైతన్ భరధ్వాజ్ 
సాహిత్యం : శుభం విశ్వనాథ్
గానం : మధుశ్రీ

సంపద్దోయ్ నన్నే
మీసమంటి సూదితో
అందగాడా
సూడద్దోయ్ నన్నే
కోడె ఈడు చూపుతో
తుంటరోడా

సుట్టుపక్కలున్న వాళ్ళు
సద్దు సేత్తె ఒప్పుకోరు
రెచ్చగొట్టమాకు నన్నే
ఊరంతా గోలేనా..ఆఆ..
నీ మాయలోనే తేలానే నేనే
కౌగిలింతలో ఇంకనిన్ను నన్ను
ఇద్దరంటె పిచ్చోళ్ళే

పచ్చ బొట్టులాగా నిన్ను
అంటుకుంటినోయ్
చూసుకుంటినోయ్ 
దాచుకుంటినోయ్
నిన్నీ జన్మలో
కుంకుం బొట్టులా
పెట్టుకుంటినోయ్
గుండె గుళ్ళో
మాటే ఇస్తున్నా


సంపద్దోయ్ నన్నే
మీసమంటి సూదితో
అందగాడా
సూడద్దోయ్ నన్నే
కోడె ఈడు సూపుతో
తుంటరోడా


ఆకువక్క పంటలే
సిగ్గు బుగ్గ పండెలే
పెదాలలో తూరుపంతా
వాలిందిలే
రెండు రెక్కలొచ్చి
తేలి తేలి పోదామా
సన్నజాజల్లె మారి
వాడిపోదామా
చచ్చి పుట్టాలే ఇవ్వాళ్ళే
లోలో చూడు దాగుంది నువ్వే
పత్తి లాంటి నన్నే
ఒత్తి చేసినావులే
దీపమల్లె
చూసుకుంటా ఇంక
నిన్ను నేను
ఇంటిముంగిట

పచ్చ బొట్టులాగా నిన్ను
అంటుకుంటినోయ్
చూసుకుంటినోయ్ 
దాచుకుంటినోయ్
నిన్నీ జన్మలో
కుంకుం బొట్టులా
పెట్టుకుంటినోయ్
గుండె గుళ్ళో మాటే ఇస్తున్నా


చల్లా చల్లా గాలులే
పిల్లి మొగ్గలేసెలే
అల్లి బిల్లి ఆశలన్నీ నీవల్లనే
చేతి గాజు లాగ మార్చి
నిన్ను ఉంచెయనా
కాలి మెట్టెల్లే నిన్ను
చుట్టి పెట్టేయ్ నా
పిల్ల బంగారే హయ్యారే
నాలో చూడు నిండుంది నువ్వే
గాజు బొమ్మ మీద
దిష్టి చుక్క నువ్వెలే
వెన్నెలల్లే మారిపోరా
ఆడుకుంటా నేను
చంటి పాపలా

పచ్చ బొట్టులాగా నిన్ను
అంటుకుంటినోయ్
చూసుకుంటినోయ్ 
దాచుకుంటినోయ్
నిన్నీ జన్మలో
కుంకుం బొట్టులా
పెట్టుకుంటినోయ్
గుండె గుళ్ళో మాటే ఇస్తున్నా 

 

2 comments:

ఈ మధ్యన చాలా మూవీస్ యెప్పుడొచ్చాయో కూడా తెలీటం లేదు..ఇందులో వెయ్యటం వల్ల యెట్లీస్ట్ మంచి పాటలు మిస్ అవటం లేదు..

థాంక్స్ ఫర్ ద కామెంట్ అండ్ యువర్ ఎంకరేజ్మెంట్ శాంతి గారు...

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.