మంగళవారం, మే 14, 2019

మెల్ల మెల్ల మెల్ల మెల్లగా...

ఏబిసిడి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఎబిసిడి (2019)
సంగీతం : జుదా శాండీ  
సాహిత్యం : కృష్ణకాంత్ 
గానం : సిద్ శ్రీరామ్, అధితి భావరాజు 

మెల్ల మెల్ల మెల్ల మెల్లగా
గుండెల్లో కొత్త రంగు చల్లావే
మెల్ల మెల్ల మెల్ల మెల్లగా
కన్నుల్లో మత్తులాగ అల్లావే
కలా నిజం ఒకే క్షణం
అయోమయం దాగుందే
చెరో సగం పంచే విధం
ఇదేమిటో బాగుందే

మెల్ల మెల్ల మెల్ల మెల్లగా
గుండెల్లో కొత్త రంగు చల్లావే
మెల్ల మెల్ల మెల్ల మెల్లగా
కన్నుల్లో మత్తులాగ అల్లావే

నీతో చేరుతూ ఏదో కొత్తగా
మరో నేనులా మారానే
పదా రమ్మని అలా వేలితో
కాలాన్నే ఇలా ఆపావే
ఎందుకేమో ముందులేదే 
ఈ హాయి
సందడేమో అల్లుతూనే 
నీవైపోయే
ప్రతీ క్షణం సంతోషమే
నేనెప్పుడూ చూడందే
ప్రపంచమే చూశానులే
నీలా ఏదీ లేదంతే

మెల్ల మెల్ల మెల్ల మెల్లగా
గుండెల్లో కొత్త రంగు చల్లావే
మెల్ల మెల్ల మెల్ల మెల్లగా
కన్నుల్లో మత్తులాగ అల్లావే

మెరిసే లోపలే మనసే
మురిసే నిన్నిలా కలిసే
నిమిషాలు రోజులై
నిలిచేను చేతిలో
నేనుంటా నీడలా ఇలా
నీతోనే అన్ని వేళలా

మెల్ల మెల్ల మెల్ల మెల్లగా
నచ్చాడే అల్లారేదో తెచ్చాడే
మెల్ల మెల్ల మెల్ల మెల్లగా
నచ్చాడే ఆశలేవో ఇచ్చాడే


మెల్ల మెల్ల మెల్ల మెల్లగా
గుండెల్లో కొత్త రంగు చల్లావే
మెల్ల మెల్ల మెల్ల మెల్లగా
కన్నుల్లో మత్తులాగ అల్లావే
 

2 comments:

చాలా మీనింగ్లెస్ మూవీ ఇది..సాంగ్ బానే ఉంది..

హహహహ ఒక్క మాటలో తేల్చేశారుగా సినిమా రివ్యూ :-) థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు.. నిజమేనండీ చాలామంది సినిమా మొత్తంలో ఈ పాటొక్కటే బావుందని రివ్యూలు రాశారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.