ఆదివారం, మే 26, 2019

తీరు మారుతోందే...

ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ సెల్సియస్ (28C) చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : 28 డిగ్రీస్ సి (2019)
సంగీతం : శ్రవణ్ భరధ్వాజ్  
సాహిత్యం : కిట్టు విస్సప్రగడ 
గానం : అనురాగ్ కులకర్ణి

తీరు మారుతోందే
పేరు తెలియకుందే
కొత్త కొత్తగుందే ఊరికే
ఎంత దగ్గరున్నా
దూరమల్లె ఉందె
నిన్న మొన్న ఇట్టా లేదులే
కరిగి కదిలి దూకుతున్న
చినుకు లాగ మనసె
మురిసి కురిసి వెతికి
నిన్ను చేరుకున్న వరసే
చూసి కూడ చూడనట్టు
వెళ్ళిపోకు గాలిలా

ఉన్నపాటుగా
వెంట పడుతు పడుతు
ఒక్క సారిగా ఆగితే
చుట్టు పక్కలా దిక్కులన్ని చూస్తే
లెక్కపెట్టనా అంకెలే
కొంచెంగ కొంచెంగ నీ దగ్గరై
ఇంకాస్త దూరంగ నన్నుంచితే
నీ చేయి దాటేసి ఆ గీతలే
నీకు నాకు బంధమేయవా

నీకోసం ఆరాటమూ
నువ్వుంటే మోమాటమూ
తాకాలనీ నీ గురుతుని
క్షణం ఎటూ కదలకే మరి
కళ్ళ ముందరే నువ్వు ఉండగా
గుండె చప్పుడే వినపడేట్టుగా
గుర్తు చేయాలనే కోరికే
సిగ్గుతో చంపుతుందే

తీరు మారుతోందే
పేరు తెలియకుందే
కొత్త కొత్తగుందే ఊరికే
ఎంత దగ్గరున్నా
దూరమల్లె ఉందె
నిన్న మొన్న ఇట్టా లేదులే
కరిగి కదిలి దూకుతున్న
చినుకు లాగ మనసె
మురిసి కురిసి వెతికి
నిన్ను చేరుకున్న వరసే
చూసి కూడ చూడనట్టు
వెళ్ళిపోకు గాలిలా

  

2 comments:

గుడ్ సాంగ్

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.