బుధవారం, మే 15, 2019

ఇదేం లైఫురా...

మిఠాయి చిత్రంలోని ఒక సరదా అయిన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మిఠాయి (2019)
సంగీతం : వివేక్ సాగర్    
సాహిత్యం : కిట్టు విస్సాప్రగడ
గానం : శ్రావ్య కొత్తలంక   

ఉలికిపడకుర తెల్లారె అల్లారం మోగగా
ఆ పరుగు మొదలుగ కంగారుగా కాలు జారదా
ఆ ఉలికిపడకుర తెల్లారె అల్లారం మోగగా
ఆ పరుగు మొదలుగ కంగారుగా కాలు జారదా
కదల లేని విమానం లో ఎగరని ఊహలు
పదమని తోసే సవాలు
మరి మరి మరి మరీతొందరా
గజిబిజి గజిబిజి రొటీనే కదా 
అరె అరె అరె అరె ఇదెం లైఫురా
పోరా.. హ..హాఆఆఆఆఆ....
మరి మరి మరి మరీతొందరా
గజిబిజి గజిబిజి రొటీనే కదా 
అరె అరె అరె అరె ఇదెం లైఫురా
పోరా.. ప్పోరా.. ఆఆఆఆఆ....

తారుమారుగున్నా దారిమారుతున్నా
ఫేటు మారదన్నా నిరాశేరా
కొత్త ఫాంటు కుట్టి లుక్కు మార్చుకున్నా
డస్టు బిన్ను నిండా చెత్త లేదా
రాజు గారి జమానా
రాయలేదు ఖజానా
నీకు దిక్కు ఠికానా ఇదే కదా
రాజు గారి జమానా
రాయలేదు ఖజానా
నీకు దిక్కు ఠికానా ఇదే కదా
నైజాం సోకు నేడు
పెద్ద అస్సాం అయ్యిందే
ఒళ్ళే హూనమై దిల్లే లొల్లిపెట్టి
గుస్సా పెంచిందే
మనసిక కలవర పడేలా
మరి అడుగులు తడబడనదేలా
వెతికిన దొరకని చరిత్రే నీదే
హే..హే..హే..

మరి మరి మరి మరీతొందరా
గజిబిజి గజిబిజి రొటీనే కదా 
అరె అరె అరె అరె ఇదెం లైఫురా
పోరా.. హ..హాఆఆఆఆఆ....
మరి మరి మరి మరీతొందరా
గజిబిజి గజిబిజి రొటీనే కదా 
అరె అరె అరె అరె ఇదెం లైఫురా
పోరా.. పో ప్పోరా.. ఆఆఆఆఆ....

ఓ గంట కొట్టగానే దండమెట్టుకొచ్చి
సిద్దమంటు చేరే బంటు లేడే
గోటి తోటి పోయే దాన్ని
గొడ్డలెత్తి నరికి చూసుకున్న లైఫునీదే
ఆశపెట్టి మిఠాయి పోయె బతుకు బడాయి
రోజుకొక్క లడాయి బడేమియా
ఆశపెట్టి మిఠాయి పోయె బతుకు బడాయి
రోజుకొక్క లడాయి బడేమియా
సింహం లాగ బతికేయ్ నీ తాతలు నిన్నిట్టా
గడ్డే పెట్టమన్న గొర్రే పిల్ల చేసి గోడలు ఎక్కారే
మనసిక కలవర పడేలా
మరి అడుగులు తడబడనదేలా 
వెతికిన దొరకని చరిత్రే నీదే
హే..హే..హే..

మరి మరి మరి మరీతొందరా
గజిబిజి గజిబిజి రొటీనే కదా 
అరె అరె అరె అరె ఇదెం లైఫురా
పోరా.. హ..హాఆఆఆఆఆ....
మరి మరి మరి మరీతొందరా
గజిబిజి గజిబిజి రొటీనే కదా 
అరె అరె అరె అరె ఇదెం లైఫురా
పోరా.. పో ప్పోరా.. ఆఆఆఆఆ....

ఆ ఉలికిపడకుర తెల్లారె అల్లారం మోగగా
ఆ పరుగు మొదలుగ కంగారుగా కాలు జారదా
కదల లేని విమానం లో ఎగరని ఊహలు
పదమని తోసే సవాలు


2 comments:

ప్రియదర్శి డెఫ్నెట్ గా వెర్సటైల్ యాక్టర్..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు.. అవునండీ అతనిది మల్లేశం అని ఓ మూవి వస్తుంది దాని గురించి ఎదురు చూస్తున్నాను.. బావుంటుందనిపిస్తుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.