గురువారం, మే 02, 2019

చందమామే చేతికందే...

118 చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : 118 (2019)
సంగీతం : శేఖర్ చంద్ర
సాహిత్యం : రామాంజనేయులు
గానం : యాసిన్ నిజార్

చందమామే చేతికందే...
వెన్నెలేమో మబ్బులోనే
పూలచెట్టే కళ్ళముందే..
పువ్వులేమో కొమ్మపైనే
చూస్తూనే ఎంతసేపు..
తాకితేనే ఏంటి తప్పు
పాతికేళ్ల బ్రహ్మచారి..
బాధ చూడవా?
పెళ్లి డేటు ఎప్పుడంటూ..
లెక్కలేసి చూసుకొంటూ
రొమాన్సు చెయ్యనీయవా?

హో మై  గాడ్..
ఎంచేసావ్?
చెక్ ఇచ్చి.. సంతకాన్ని ఆపేశావ్
హో మై గాడ్..
ముంచేసావ్
ఐఫోన్ ఇచ్చి.. స్క్రీను లాకేసావ్

చేతిలోనే చెయ్యి వేసి
మాట నీకు ఇస్తాను
ఎన్నడైనా నిన్ను వీడి
పాదమైన పోనీను
రెండు కళ్ళలో.. హు.. హు.. హు
నింపుకున్న.. నీ రూపాన్ని
రెప్పమూసినా.. నాలాలో నువ్వే
ప్రేమ అంటే  ఇద్దరైనా..
ఒక్కరల్లే పుట్టుకేలే

చందమామే చేతికందే
వెన్నెలేమో మబ్బులోనే
పూలచెట్టే కళ్ళముందే
పువ్వులేమో కొమ్మపైనే
చూస్తూనే ఎంతసేపు..
తాకితేనే ఏంటి తప్పు
పాతికేళ్ల బ్రహ్మచారి..
బాధ చూడవా?
పెళ్లి డేటు ఎప్పుడంటూ..
లెక్కలేసి చూసుకొంటూ
రొమాన్సు చెయ్యనీయవా?

హో మై  గాడ్..
ఎంచేసావ్?
కొత్త బైకు ఇచ్చి..
తాళమేమో దాచేసావ్
హో మై గాడ్..
ముంచేసావ్?
ATM ఇచ్చి..
నో కాష్ బోర్డుఎట్టావ్

నువ్వు నేను ఉన్న చోట
రేపు కూడా ఈ రోజే
నువ్వు నేను వెళ్ళు బాట
పూలతోట అయ్యేలే
రెక్కలెందుకో.. హో.. హో.. హో
గాలిలోనా తేలాలంటే
చెయ్యి అందుకో ఆ మేఘం పైకే
దారమల్లే మారిపోయి..
నిన్ను నేను.. చేర్చుతానే

చందమామే చేతికందే
వెన్నెలేమో మబ్బులోనే
పూలచెట్టే కళ్ళముందే
పువ్వులేమో కొమ్మపైనే
చూస్తూనే ఎంతసేపు
తాకితేనే ఏంటి తప్పు
పాతికేళ్ల బ్రహ్మచారి..
బాధ చూడవా?
పెళ్లి డేటు ఎప్పుడంటూ..
లెక్కలేసి చూసుకొంటూ
రొమాన్సు చెయ్యనీయవా?

హో మై  గాడ్..
ఎంచేసావ్?
కొత్త బైకు ఇచ్చి..
తాళమేమో దాచేసావ్
హో మై గాడ్
ముంచేసావ్?
ATM ఇచ్చి
నో కాష్ బోర్డెట్టావ్

 

2 comments:

ఈ మూవీ బావుందన్నారు .. చూడాలి

మరీ ఎక్సెలెంట్ కాదు కానీ లాజిక్స్ పక్కనపెట్టేస్తే డిఫరెంట్ కాన్సెప్ట్ అండీ.. ఒకసారైనా చూడాల్సిన సినిమా చూడండి. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.