సోమవారం, మే 06, 2019

ఏ మనిషికే మజిలీయో...

మజిలి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలనుకుంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మజిలి (2019)
సంగీతం : గోపీసుందర్  
సాహిత్యం : వనమాలి
గానం : అరుణ్ గోపన్, చిన్మయి, బేబీ అనుష 

ఏ మనిషికే మజిలీయో
పైవాడు చూపిస్తాడు
నువు కోరుకుంటే మాత్రం
దొరికేది కాదంటాడు
ఓ మదిని దూరం చేస్తే
ఇంకోటి ముడి వేస్తాడు
ఎదలోని ప్రేమను వేరే
మజిలీకి చేరుస్తాడు

నువ్వు..నిజంలాగ
నను ముడేస్తుంటె
ఈ నిమిషానా
నేను..గతంలోని
ఆ కలల్లోనె వున్నా..
నువ్వు..ప్రతీసారి
నీ ప్రపంచంలొ
నను చూస్తూన్నా..
నేను..అదే పనిగ
నిను వెలేస్తూనె వున్నా..
నువ్వు..నను కడలిలోని
ఆ కెరటమల్లె విడిపోకున్నా
నేను..ఒక మనసులేని
శిలలాగ మారినానా..

ఏ మనిషికే మజిలీయో
పైవాడు చూపిస్తాడు
నువు కోరుకుంటే మాత్రం
దొరికేది కాదంటాడు
ఓ మదిని దూరం చేస్తే
ఇంకోటి ముడి వేస్తాడు
ఎదలోని ప్రేమను వేరే
మజిలీకి చేరుస్తాడు

నా నిన్నలోని
ఆ గురుతులన్నీ
ఈ మనసులోంచి
చెరిపేదెలాగా..?
ఇన్నాళ్ళు నాలో
కలిసున్న ప్రాణం
నే వేరు చేసి
బ్రతికేదెలాగ..?
ఈ వేషమే ఎన్నాళ్ళని
విధి ఆడుతోందా
ఈ నాటకాన్ని

నువ్వు..నిజంలాగ
నను ముడేస్తుంటె
ఈ నిమిషానా
నేను..గతంలోని
ఆ కలల్లోనె వున్నా..

నీ పిలుపు కోసం
వెతికింది మౌనం
ఆ వరము కోరి
మిగిలుంది ప్రాణం
నా గుండెనడుగు
చెబుతుంది నీకె
ఈ ఊపిరుందీ
నీ చెలిమి కొరకే
నీ కోసమె వెచిందిలే
నువు సేద తీరె
ఈ ప్రేమ మజిలీ

నేను నిజంలాగ
నిను ముడేస్తుంటె
ఈ నిమిషానా
నువ్వు గతంలోని
ఆ కలల్లోనె వున్నా
నేను ప్రతీసారి
నా ప్రపంచంలా
నిను చూస్తున్నా
నువ్వు అదేపనిగ
నను వెలేస్తూనె వున్నా
నేను నిను కడలిలోని
ఆ కెరటమల్లె విడిపోకున్నా
నువ్వు ఒక మనసు లేని
శిలలాగ మారినావా..

ఏ మనిషికే మజిలీయో
పైవాడు చూపిస్తాడు
నువు కోరుకుంటే మాత్రం
దొరికేది కాదంటాడు
ఓ మదిని దూరం చేస్తే
ఇంకోటి ముడి వేస్తాడు
ఎదలోని ప్రేమను వేరే
మజిలీకి చేరుస్తాడు


2 comments:

సమంత రాక్స్..చాలా బావుందీ పాట..

అవునండీ తన పెర్ఫార్మెన్స్ సూపర్బ్.. థాంక్స్ ఫర్ ద కామెంట్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.