డియర్ కామ్రేడ్ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : డియర్ కామ్రేడ్ (2019)
సంగీతం : జస్టిన్ ప్రభాకరన్
సాహిత్యం : రెహ్మాన్
గానం : గౌతమ్ భరధ్వాజ్
నీ నీలి కన్నుల్లోని ఆకాశమే
తెల్లారి అల్లేసింది నన్నే
నీ కాలి అందెల్లోని సంగీతమే సోకి
నీ వైపే లాగేస్తుంది నన్నే
నీ పూల నవ్వుల్లోని ఆనందమే
తేనెల్లో ముంచేసింది కన్నే
నీకోసమే నా
కళ్ళే వాకిళ్లే
తీసి చూసే ముంగిళ్లే
రోజు ఇలా నే వేచి ఉన్నాలే
ఊగే ప్రాణం నీవల్లే
ఎవరూ చూడని
ఈ అలజడిలో
కుదురు మరచిన
నా ఎద సడిలో
ఎదురు చూస్తూ
ప్రతి వేకువలో
నిదుర మరచిన
రాతిరి ఒడిలో
నీ నీలి కన్నుల్లోని ఆకాశమే
నీ కాలి అందెల్లోని సంగీతమే సోకి
2 comments:
ఫావరెట్ పెయిర్..వైటింగ్ ఫర్ ద మూవీ..
నేనుకూడానండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.