ఆదివారం, మే 19, 2019

కీచురాయి కీచురాయి...

వజ్ర కవచధర గోవింద చిత్రంలోని ఒక సరదా ప్రేమ పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : వజ్రకవచధర గోవింద (2019)
సంగీతం : బుల్గానిన్   
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : బుల్గానిన్

కీచురాయి కీచురాయి
కంచుగొంతు కీచురాయి
నింగిదాక ఖంగుమందె నీ సన్నాయి
లంగా వోణి రాలుగాయి
చాలు చాలు నీ బడాయి
మచ్చుకైన కానరాదె నీలో అమ్మాయి
మరీ అలా మగాడిలా పోటెత్తమాకే
గందరగోళాలకీ
పూరేకులా నాజుకులు నేర్పించుకోవే
అందచందాలకీ
హేయ్ నా మాట వినీ
హేయ్ నీ పద్దతినీ
హేయ్ జర మార్చుకుని
ప్రేమలో పడవే
ఐలవ్యూ ఐలవ్యూ ఐలవ్యూ అన్నా
అయ్యయ్యో మనసారా వినరాదా
ఔనన్నా కాదన్నా ఒట్టేసి చెబుతున్నా
నీ కోసం పుట్టాడీ గోవిందా

ఐలవ్యూ ఐలవ్యూ ఐలవ్యూ అన్నా
అయ్యయ్యో మనసారా వినరాదా
ఔనన్నా కాదన్నా ఒట్టేసి చెబుతున్నా
నీ కోసం పుట్టాడీ గోవిందా


అచ్చతెలుగు అందం నీలో ఎంతో దాగుందే
గుర్తుపట్టు దాన్ని ఓ కొంచెం
రౌడీ పిల్లలాగా తిరుగుతుంటే బాలేదే
మారిపోవే పిల్లా నా కోసం
తవలా పాకంటీ లేత చేతుల్తో
తగువులాటేలా ఒంపుల వయ్యారీ
కలలే తారాడే కాటుక కన్నుల్లో
కోప తాపాలు వద్దే సుకుమారీ
ఛూ మంత్రాలే వేసి
నిను మార్చుకుంటాలే

ఐలవ్యూ ఐలవ్యూ ఐలవ్యూ అన్నా
అయ్యయ్యో మనసారా వినరాదా
ఔనన్నా కాదన్నా ఒట్టేసి చెబుతున్నా
నీ కోసం పుట్టాడీ గోవిందా

ఐలవ్యూ ఐలవ్యూ ఐలవ్యూ అన్నా
అయ్యయ్యో మనసారా వినరాదా
ఔనన్నా కాదన్నా ఒట్టేసి చెబుతున్నా
నీ కోసం పుట్టాడీ గోవిందా


కీచురాయి కీచురాయి
కోయిలల్లె మారవోయి
ప్రేమ పాట పాడవోయి నా జోడీగా
చేరుకోవె దాయి దాయి
కలుపుకోవే చేయి చేయి
మనసు మనసు మార్చుకుందాం
రా సరదాగా..
తొలిచూపుకే నిన్నెందుకో మెచ్చింది కన్ను
సొగసరి గోదావరి
మలి చూపులో ప్రాణాలనే ఇచ్చేసినాను
ఊపిరి నీదే మరి
హే యువరాణివనీ
హే పరువాలగనీ
నా కలలో నిజమై
కదలి రమ్మన్నా

ఐలవ్యూ ఐలవ్యూ ఐలవ్యూ అన్నా
అయ్యయ్యో మనసారా వినరాదా
ఔనన్నా కాదన్నా ఒట్టేసి చెబుతున్నా
నీ కోసం పుట్టాడీ గోవిందా

ఐలవ్యూ ఐలవ్యూ ఐలవ్యూ అన్నా
అయ్యయ్యో మనసారా వినరాదా
ఔనన్నా కాదన్నా ఒట్టేసి చెబుతున్నా
నీ కోసం పుట్టాడీ గోవిందా
 

2 comments:

ఈ మూవీ పేరు భలే ఉందండీ..సప్తగిరి టాలెంటెడ్ యాక్టర్..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.