శుక్రవారం, మే 24, 2019

కుహూ కుహూ అని కోయిలమ్మా...

ఈ రోజు విడుదలవుతున్న సీత చిత్రం యూనిట్ కు ఆల్ ద బెస్ట్ చెబుతూ అందులోని ఒక చక్కని పాట విందాం. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడచ్చు.


చిత్రం : సీత (2019)
సంగీతం : అనూప్ రూబెన్స్ 
సాహిత్యం : లక్ష్మీ భూపాల్
గానం : అర్మాన్ మాలిక్

ఒఓ.. ఒఓ.. ఒఓ.. ఒఓ..
ఒఓ ఒఓ ఒఓ ఒఓ
కుహూ కుహూ అని కోయిలమ్మా
తీయగ నిన్నే పిలిచిందమ్మా
కోపం చాలమ్మ
బదులుగ నవ్వొకటివ్వమ్మా
హో.. కుహూ కుహూ అని కోయిలమ్మా
తీయగ నిన్నే పిలిచిందమ్మా
కోపం చాలమ్మ
బదులుగ నవ్వొకటివ్వమ్మా

ఆ నవ్వులే సిరిమల్లెలై
పూయాలిలే నీ పెదవంచులో
ఈ పూలకీ ఆరాటమే
చేరాలనీ జడ కుచ్చుల్లలో
ఓ ఇంధ్రధనుసే వర్ణాల వానై
కురిసెను జల జల
చిటపట చినుకులుగా

కుహూ కుహూ అని కోయిలమ్మా
తీయగ నిన్నే పిలిచిందమ్మా
కోపం చాలమ్మా
బదులుగ నవ్వొకటివ్వమ్మా

ఈ చల్లగాలి ఓ మల్లెపువ్వై
నిన్నల్లుకుంటూ ఆగాలి
ఆ వాన మేఘం నీ నవ్వుకోసం
ఓ మెరుపు లేఖే రాయాలి
ఓఓ..ఒఓ..ఓఓ..ఒఓ..
ఈ చల్లగాలి ఓ మల్లెపువ్వై
నిన్నల్లుకుంటూ ఆగాలి
ఆ వాన మేఘం నీ నవ్వుకోసం
ఓ మెరుపు లేఖే రాయాలి
సెలయేరు పైన జలతారు వీణ
పలికెను గలగల సరిగమపదనిసలా

కూకూకూ..
కుహూ కుహూ అని కోయిలమ్మా
తీయగ నిన్నే పిలిచిందమ్మా
కోపం చాలమ్మ
బదులుగ నవ్వొకటివ్వమ్మా

నీలాల నింగీ చుక్కల్ని తెచ్చీ
నక్షత్ర మాలే వెయ్యాలీ
నీకంటి నీరూ వర్షించకుండా
దోసిళ్ళ గొడుగే పట్టాలి
ఓఓ..ఒఓ..ఓఓ..ఒఓ..హో..
నీలాల నింగీ చుక్కల్ని తెచ్చీ
నక్షత్ర మాలే వెయ్యాలీ
నీకంటి నీరూ వర్షించకుండా
దోసిళ్ళ గొడుగే పట్టాలి
ఏ కష్టమైనా ఉంటాను తోడై
తడబడు అడుగున
జతపడి నేనున్నా

కూ..కూ..కూఊఊ...
కుహూ కుహూ అని కోయిలమ్మా
తీయగ నిన్నే పిలిచిందమ్మా
కోపం చాలమ్మ
బదులుగ నవ్వొకటివ్వమ్మా 


4 comments:

డ్యూ రేపెక్ట్స్ టూ తేజ గారు..ఈ మూవీ చూడాలంటే అవధులు లేని ఓపిక కావాలి..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు.. ఇలాంటి కామెంట్స్ ఆయనకి అలవాటైపోయుంటాయ్ లెండి. ఓ సినిమా చూసేశారా..

నాకు ఇష్టం అయిన సినిమా అందులో ఈ బాగా ఇష్టం

థాంక్స్ ఫర్ యువర్ కామెంట్ ప్రవీణ్ గారూ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.