శనివారం, మే 04, 2019

ప్రేమ వెన్నెలా...

చిత్రలహరి సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడ్ చేసిన ప్రోమో వీడియో ఇక్కడ చూడవచ్చు. పూర్తి పాట లిరికల్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : చిత్రలహరి (2019)
సంగీతం : దేవీశ్రీప్రసాద్
సాహిత్యం : శ్రీమణి
గానం : సుదర్శన్ అశోక్

రంగు రంగు పువ్వులున్న
అందమైన తోటలో
ఇప్పుడే పూసిన కొత్త పువ్వులా
ఏడు రంగులొక్కటై
పరవశించు వేళలో
నేలకే జారిన కొత్త రంగులా

వాన లా వీణ లా
వాన వీణ వాణిలా
గుండెలో పొంగిన కృష్ణవేణిలా
ఒంటరి మనసులో ఒంపి వెళ్ళకే ఆలా
సరిగమల్ని తియ్యగా ఇలా

ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళ
ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళ


రంగు రంగు పువ్వులున్న
అందమైన తోటలో
ఇప్పుడే పూసిన కొత్త పువ్వులా
ఏడు రంగులొక్కటై
పరవశించు వేళలో
నెలకే జారిన కొత్త రంగులా

దిద్దితే నువ్వలా
కాటుకే కన్నులా
మారదా పగలిలా
అర్ధరాత్రిలా
నవ్వితే నువ్వలా
మెల్లగా మిల మిలా
కలవరం గుండెలో
కలత పూతలా
రాయలోరి నగలలోంచి
మాయమైన మణులిలా
మారిపోయెనేమో నీ
రెండు కళ్ళలా
నిక్కమైన నీలమొకటి
చాలు అంటూ వేమన
నిన్ను చూసి రాసినాడెలా

ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళ
ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళ

నడవకే నువ్వలా
కలలలో కోమలా ఆ..హా.
నడవకే నువ్వలా
కలలలో కోమలా
పాదమే కందితే
మనసు విల విలా
విడువకే నువ్వలా
పలుకులే గలగల
పెదవులే అదిరితే
గుండె గిల గిలా

అంతు లేని అంతరీక్షమంతు
చూడకే అలా
నీలమంతా దాచిపెట్టి
వాలు కన్నులా
ఒక్కసారి గుండెలోకి
అడుగుపెట్టి రా ఇలా
ప్రాణమంత పొంగిపోయేలా

ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళ
ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా... 


2 comments:

విత్ డ్యూ రెస్పెక్ట్స్ టూ తేజ్ ఫాన్స్..చాలా బోరింగ్ గా అనిపించిందండీ ఈ మూవీ..

మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు థాంక్స్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.