మంగళవారం, మే 28, 2019

అయామ్ ఇన్ లవ్...

క్రేజీ క్రేజీ ఫీలింగ్ చిత్రంల్లోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : క్రేజీ క్రేజీ ఫీలింగ్ (2019)
సంగీతం : భీమ్స్ సిసిరొలియో  
సాహిత్యం : సురేష్ ఉపాధ్యాయ్
గానం : నయనా నాయర్  

ఏదో మాయల్లో ఉన్నా
ఏంటో మైకంలో ఉన్నా
అరెరె ఏమై పోతున్నా
ఏదో అవుతున్నా
నువ్వే ఎక్కడికంటున్నా
రెక్కలు కట్టుకు వస్తున్నా
నీతో చుక్కలలోకానా తేలిపోతున్నా
నీ రెండు కన్నుల్లో నన్నే చూస్తున్నా
నా చిన్ని గుండెల్లో నిన్నే మోస్తున్నా
నీ వల్లే నేనిల్లా
మారానా హా...

ఐయామ్ ఇన్ లవ్
ఐయామ్ ఇన్ లవ్ విత్ యూ
ఐయామ్ ఇన్ లవ్
ఐయామ్ ఇన్ లవ్ విత్ యూ
ఐయామ్ ఇన్ లవ్
ఐయామ్ ఇన్ లవ్ విత్ యూ

వచ్చిపోయే దారే పూల ఏరు తీరే
ఇంతలోనె ఎంత మారిపోయిందిలే
పచ్చి పైర గాలే గుచ్చు తున్న వలే
నొప్పి కూడా చెప్పనంత హాయిగుందిలే

ప్రేమ అంటుకుంటే ఇంతేనులే
పేరేమిటో కూడా మరిచేవులే
బాగుంది మైమరపు
లాగింది నీ చూపు
ఏ వైపు నేనున్న
వస్తున్నా నీ వైపుకే

ఐయామ్ ఇన్ లవ్
ఐయామ్ ఇన్ లవ్ విత్ యూ
ఐయామ్ ఇన్ లవ్
ఐయామ్ ఇన్ లవ్ విత్ యూ
ఐయామ్ ఇన్ లవ్
ఐయామ్ ఇన్ లవ్ విత్ యూ
ఐయామ్ ఇన్ లవ్
ఐయామ్ ఇన్ లవ్ విత్ యూ 

 

3 comments:

భీంస్ మ్యూజిక్ యే అనుకుంటా.. రమ్మంటె రాదుర చెలియ సాంగ్ కూడా చాలా బావుంటుందండి..వీలైతే షేర్ చెయ్యండి..

కాదు శాంతి గారు. అది వినోద్ యజమాన్య కంపోజ్ చేసినది ఆల్రెడీ మన బ్లాగ్ లో షేర్ చేశానండీ ఇదీ ఆ పాట లింక్.. https://sarigamalagalagalalu.blogspot.com/2016/03/blog-post.html

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.