గురువారం, మే 09, 2019

నీలోని సిలకమ్మ...

శంకర జయంతి సందర్బంగా ఆ ఈశ్వరుని స్మరించుకుంటూ దిక్సూచీ చిత్రంలోని ఒక చక్కని పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : దిక్సూచి (2019)
సంగీతం : పద్మానవ్ భరద్వాజ్
సాహిత్యం : శ్రీరామ్ తపస్వి 
గానం : హరిణి 

నీలోని సిలకమ్మ
ఏ కొమ్మ సిలకమ్మ

నవరంధ్రముల
గూటిలోనున్న
సిలకమ్మ
ఓరోరి జీవా
నీ శోకమేలా
కర్మానుసారం
స్థిత ప్రజ్ఞుడవరా
శివ లీల నీకు
దిక్సూచి లేరా
కర్తవ్యమెరిగీ
పయనించు నరుడా

నీలోని సిలకమ్మ
ఏ కొమ్మ సిలకమ్మ

నీ చెంత కొండంత
శివదేవుడున్నాడు
నీ వెంట ఆ శివుడు
ఓ దీపమయ్యాడు
చీకట్ల తెరలు
కరిగించినావూ
మజిలీల వలలూ
దాటొచ్చినావూ
శివలీల నీకు
దిక్సూచి కాగా
వసివాడిపోనీ
వెలుగందుకోరా

నీలోని సిలకమ్మ
ఏ కొమ్మ సిలకమ్మ

నీలోని సిలకమ్మ
ఏ కొమ్మ సిలకమ్మ
నవరంధ్రముల
గూటిలోనున్న సిలకమ్మ
సిలకెగిరి పోతే
ఓరోరి నరుడ
నీ తనువు కాదా
ఆ కాటి సమిధ
నీ ఆలు సుతులు
నీ వెంట రారూ
ఇది తెలిసియున్నా
నీ తపన పోదు

నీలోని సిలకమ్మ
ఏ కొమ్మ సిలకమ్మ
  
 

3 comments:

నిజంగా చాలా ఆస్పీషియస్ రోజండి..అటు భగవద్ రామానుజ జయంతి..ఇటు శ్రీ శంకర భగవత్పాదుల జయంతి ఒకే రోజవడం అద్భుతం కదా..నైస్ సాంగ్..

అవునండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.