అర్జున్ సురవరం చిత్రంలోని ఒక చక్కని ప్రేమ గీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : అర్జున్ సురవరం (2019)
సంగీతం : శామ్ సి.ఎస్.
సాహిత్యం : శ్రీమణి
గానం : అనురాగ్ కులకర్ణి, చిన్మయి
నా మనసిలా మనసిలా
ఓ మనసే కోరుకుందే
నీ మనసుకే మనసుకే
ఆ వరసే చెప్పమందే
ఏమో ఎలా చెప్పేయడం
ఆ తీపి మాటే నీతో
ఏమో ఎలా దాటేయడం
ఈ తగువే తకధిమితోం
ఏదో తెలియనిది
ఇన్నాళ్ళూ చూడనిదీ
నేడే తెలిసినదీ
మునుపెన్నడు లేనిది
మొదలవుతుందే
ఏదో జరిగినదే
బరువేదో పెరిగినదే
మౌనం విరిగినదే
పెదవే విప్పే వేళ ఇదే
కన్నే కన్నే రెప్పే వేస్తే
నీకలలోకే నడిచాలే
నిన్నే నిన్నే చూస్తూ చూస్తూ
నన్నే నేనే మరిచానే
కన్నే కన్నే రెప్పే వేస్తే
నీకలలోకే నడిచాలే
నిన్నే నిన్నే చూస్తూ చూస్తూ
నన్నే నేనే మరిచానే
తియ్యగా తియతీయ్యగా
నీ తలపులు పంచవేలా
దాచుతూ ఏమార్చుతూ
నిన్ను నువ్వే దాస్తావెందుకలా
ఓ చినుకు కిరణం
కలగలిపే మెరుపే హరివిల్లే
సమయం వస్తే
ఆ రంగులు నీకే కనపడులే
మెల్లగా మెల మెల్లగా
మన దారులు కలిసెనుగా
హాయిలో ఈ హాయిలో
ఆకాశాలే దాటేశాగా
ఇన్నాళ్ళ నా ఒంటరితనమే
చెరిగెను నీ వల్లనే
చూపులతో కాక పెదవులతో
చెప్పేయ్ మాటలనే
కన్నే కన్నే రెప్పే వేస్తే
నీ కలలోకే నడిచాలే
నిన్నే నిన్నే చూస్తూ చూస్తూ
నన్నే నేనే మరిచానే
కన్నే కన్నే రెప్పే వేస్తే
నీ కలలోకే నడిచాలే
నిన్నే నిన్నే చూస్తూ చూస్తూ
నన్నే నేనే మరిచానే
కదలిక తొలి కదలిక
నా నిలకడ తలపుల్లో
సడలిక తొలి సడలిక
మరి చుట్టూ బిగిసిన సంకెలలో
ఈ కలహం విరహం
తియ్యని తరహాగుండదు
విడుదలెలా
వినవా చెలియ కనిపించని
పెదవుల పలుకులిలా
మొదలిక తొలిసారిగా
నా యెదలో అలజడులే
నిదురిక కరువవ్వగ
మరి కుదురే కుదురే చెదిరెనులె
ఇన్నేళ్ల కాలం మెరిసెనులే
నిన్నే కలిసిన వేళ
నా ఊహల విస్మయ విశ్వంలో
వెన్నెల నీ చిరునవ్వే
కన్నే కన్నే రెప్పే వేస్తే
నీ కలలోకే నడిచాలే
నిన్నే నిన్నే చూస్తూ చూస్తూ
నన్నే నేనే మరిచానే
కన్నే కన్నే రెప్పే వేస్తే
నీ కలలోకే నడిచాలే
నిన్నే నిన్నే చూస్తూ చూస్తూ
నన్నే నేనే మరిచానే
2 comments:
ఈ మూవీ రీసెంట్ రిలీజ్ అనుకుంటా కదా..నైస్ సాంగ్ ..
ఇంకా రిలీజ్ అవలేదనుకుంటానండీ.. మేలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్లున్నారు.. థాంక్స్ ఫర్ ద కామెంట్.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.