ఆదివారం, మే 05, 2019

అణిగి మణిగిన...

జెర్సీ సినిమా నుండి స్పూర్తిని నింపే ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : జెర్సీ (2019)
సంగీతం : అనిరుధ్‌
సాహిత్యం : కృష్ణకాంత్‌ (కె.కె)
గానం : కాలభైరవ

అణిగి మణిగిన అలలిక
ఎగసెను చూడరా
అసలు అవధులు లేవురా
అలుపు దరికిక చేరనీక ఆడరా
మలుపు మలుపుకు
చెరగని గురుతులు వీడరా
పగలు మెరుపులు చూపరా
వయసు సగముగ
మారిపోయి ఓడెరా

గెలుపే అడుగడుగునా
వెలుగే నిను అలమెనా
దిగులే పడె మరుగునా
మొదలే ఇక సమరమా
పడినా బెదరక పదా
పరుగే విజయము కదా
ఉరికే చెమటల నదై కదిలెనులే

తగలగ మేఘమే ఎగురిక నింగి వైపుకే
కొలవని వేగమే అడుగులో చూపటానికే
మరిచిన తారవే ముసుగిక నేడు వీడెలే
పరుగుల దాహమే బరువిక తేలికాయెలే

అణిగి మణిగిన అలలిక
ఎగసెను చూడరా
అసలు అవధులు లేవురా
అలుపు దరికిక చేరనీక ఆడరా
మలుపు మలుపుకు
చెరగని గురుతులు వీడరా
పగలు మెరుపులు చూపరా
వయసు సగముగ
మారిపోయి ఓడెరా

గమనాలనే.. గమనించరా..ఆఅ..
గమనాలనే గమనించరా
ఒక రోజు గమ్యమెదురవదా
గగనాలనే గురిచూడరా
మరి నేల నీకు వశమవదా

గమనాలనే గమనించరా
ఒక రోజు గమ్యమెదురవదా
గగనాలనే గురిచూడరా
మరి నేల నీకు వశమవదా

పిడుగు వలెనె పడుతు
కలుపు ఇక ఈ నింగీ నేలా
ఉరుము మెరుపు బరిలో నిలుపు
ఇక అంతా నీదేరా
అడుగు కదుపు జయము జగము
నీ సొంతం అయ్యేలా
విధికి ఎదురు నిలిచి గెలిచి
నీ పంతం చూపేలా

తగలగ మేఘమే ఎగురిక నింగి వైపుకే
కొలవని వేగమే అడుగులో చూపటానికే
మరిచిన తారవే ముసుగిక నేడు వీడెలే
పరుగుల దాహమే బరువిక తేలికాయెలే

అణిగి మణిగిన అలలిక
ఎగసెను చూడరా
అసలు అవధులు లేవురా
అలుపు దరికిక చేరనీక ఆడరా
మలుపు మలుపుకు
చెరగని గురుతులు వీడరా
పగలు మెరుపులు చూపరా
వయసు సగముగ
మారిపోయి ఓడెరా

గెలుపే అడుగడుగునా
వెలుగే నిను అలమెనా
దిగులే పడె మరుగునా
మొదలే ఇక సమరమా
పడినా బెదరక పదా
పరుగే విజయము కదా
ఉరికే చెమటల నదై కదిలెనులే

తగలగ మేఘమే ఎగురిక నింగి వైపుకే
కొలవని వేగమే అడుగులో చూపటానికే
మరిచిన తారవే ముసుగిక నేడు వీడెలే
పరుగుల దాహమే బరువిక తేలికాయెలే

అణిగి మణిగిన అలలిక
ఎగసెను చూడరా..

2 comments:

ఎక్సెలెంట్ స్క్రీన్ ప్లే..బ్యూటిఫుల్ మూవీ..

అవునండీ.. నాక్కూడా చాలా నచ్చిందీ సినిమా.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.