గురువారం, మే 30, 2019

ఏమిటో ఈ సంబరం...

రుణం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ ఛేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : రుణం (2018)
సంగీతం : ఎస్.వి.మల్లిక్ తేజ
సాహిత్యం : ఎస్.వి.మల్లిక్ తేజ
గానం : హరిచరణ్, చిన్మయి

ఏమిటో ఈ సంబరం
అందుతోందీ అంబరం
ఈ రుణం ఏ జన్మ పుణ్యం
ఎందుకో ఈ పూవనం
వెంటపడుతోంది ఈ క్షణం
కారణం నువ్వల్లిన బంధం
ఓ అలాఎలా మిలామిలా
ఈ మెరుపులు సాధ్యమో
నీ కిలకిల గలగల
పలుకులెలా ఆరాధ్యమో

ఈ అలజడి ఏంటో
కలబడి నిత్యం
గొడవ చేస్తోందీ
ఈ పండుగ ఏంటో
గుండెలొ మొత్తం
రంగులు పూస్తోందీ

గుండెలోనా ఇన్ని నాళ్ళూ
మిగిలినా దిగులే ఇపుడే
పారిపోయిందా
జీవితానా కొత్తవెలుగు
కోరకుండానే వరమై
చేరిపోయిందా
ఆగితే బాగుండు కద
ఈ సమయం ఇలాగే
ఆగితే బాగుండు కద
ఈ సమయం ఇలాగే
కలకాదే కథ కాదే ఇది నిజమే
చెలి మీదే చెరగనిదే ఈ ప్రేమే

ఈ అలజడి ఏంటో
కలబడి నిత్యం
గొడవ చేస్తోందీ
ఈ పండుగ ఏంటో
గుండెలొ మొత్తం
రంగులు పూస్తోందీ

ఇంతవరకూ ఇంత పరుగు
లేదు కదా ఏమయ్యిందో
నా అడుగులకు
నీ వల్లనే నా మనసిలా
రెక్కలను తొడిగేస్తుంది
నా ఊహలకూ
ఉండనీ ఉల్లాసమిక
ఏనాడు ఎటు వెళ్ళకా
ఉండనీ ఉల్లాసమిక
ఏనాడు ఎటు వెళ్ళకా
పరవశమే పావనమే ప్రేమంటే
నాలోనీ ప్రాణమే నీవంటే

ఈ అలజడి ఏంటో
కలబడి నిత్యం
గొడవ చేస్తోందీ
ఈ పండుగ ఏమో
గుండెలొ మొత్తం
రంగులు పూస్తోందీ

ఏమిటో ఈ సంబరం
అందుతోందీ అంబరం
ఈ రుణం ఏ జన్మ పుణ్యం
ఎందుకో ఈ పూవనం
వెంటపడుతోంది ఈ క్షణం
కారణం నువ్వల్లిన బంధం
ఓ అలాఎలా మిలామిలా
ఈ మెరుపులు సాధ్యమో
నీ కిలకిల గలగల
పలుకులెలా ఆరాధ్యమో

ఈ అలజడి ఏంటో
కలబడి నిత్యం
గొడవ చేస్తోందీ
ఈ పండుగ ఏంటో
గుండెలొ మొత్తం
రంగులు పూస్తోందీ


2 comments:

ఫస్ట్ టైం వినడం..బావుంది..

థాంక్స్ ఫర్ ది కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.