గురువారం, మే 16, 2019

తిరుగుడే తిరుగుడే...

వినరా సోదర వీరకుమార చిత్రంలోని ఒక సరదా పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : వినరా సోదర వీరకుమార (2019)
సంగీతం : శ్రవణ్ భరధ్వాజ్ 
సాహిత్యం : లక్ష్మీభూపాల 
గానం : శ్రవణ్ భరధ్వాజ్ 

తెల్లవారి కోడికన్న ముందులేసి
నల్లగున్న ఒంటిమీద సబ్బురాసి
పిల్లగాడు సిగ్గుతోటి మొగ్గలేసి
పిచ్చినవ్వు నవ్వెనే
కళ్ళజోడు పెట్టినాడు సూపర్ స్టార్
జుట్టు కాస్త దువ్వినాడు స్టైలిష్ స్టార్
పౌడరే కొట్టినాడు పవర్ స్టార్
ప్రేమలోన బడ్డడే..
ఎక్కడో తొక్కెనే నక్కతోక
చక్కని చుక్కనే చూడగా
దక్కునా లక్కుతో చంద్రవంక
చిక్కితే చుక్కలే చూసిరాడా.

తిరుగుడే తిరుగుడే తిరుగుడే
తిరుగుడే తిరుగుడే తిరుగుడే
తిరుగుడే తిరుగుడే తిరుగుడే


కొత్త కొత్తగుంది రోజు వెళ్ళే దారే
మత్తుమత్తుగుంది దాటి వచ్చె గాలె
ఎంత మారుతుంది ఒక్క ప్రేమతోనే
మురిసిపోయె పిల్లోడే
చూడనంత సేపు పోజు కొట్టినాడే
ఓర చూపు చూస్తే ఒణుకుపుట్టిపోయె
దగ్గరవ్వలేడు దూరముండలేడు
నిదర కూడ పోలేడే

తిరుగుడే తిరుగుడే తిరుగుడే
తిరుగుడే తిరుగుడే తిరుగుడే
తిరుగుడే తిరుగుడే తిరుగుడే


తిక్కలోడెగాని చెడ్డవాడు కాడే
లెక్కచేయడింక పోటుగాడు వీడే
డబ్బులేదుగాని గుండె చీల్చుతాడే
ప్రేమ పిచ్చి పూజారే
ఫ్రెండుగాడు ఉంటె రెచ్చిపోతాడే
నువ్వు దక్కకుంటె సచ్చిపోతాడే
నీ కాలిమెట్టె కూడా దాచుకుంటాడే
వీడు చాల మంచోడే

తెల్లవారి కోడికన్న ముందులేసి
నల్లగున్న ఒంటిమీద సబ్బురాసి
పిల్లగాడు సిగ్గుతోటి మొగ్గలేసి
పిచ్చినవ్వు నవ్వెనే
కళ్ళజోడు పెట్టినాడు సూపర్ స్టార్
జుట్టు కాస్త దువ్వినాడు స్టైలిష్ స్టార్
పౌడరే కొట్టినాడు పవర్ స్టార్
ప్రేమలోన బడ్డడే..

తిరుగుడే తిరుగుడే తిరుగుడే
తిరుగుడే తిరుగుడే తిరుగుడే
తిరుగుడే తిరుగుడే తిరుగుడే 


2 comments:

నైస్ సాంగ్..ఇదే వినడం..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.