బుధవారం, ఏప్రిల్ 11, 2018

మల్లెలు పూసే.. వెన్నెల కాసే..

ఇంటింటి రామాయణం చిత్రం కోసం బాలు గారు గానం చేసిన ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ ఆవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఇంటింటి రామాయణం(1979)
సంగీతం: రాజన్ నాగేంద్ర
సాహిత్యం : వేటూరి
గానం : యస్ పి బాలసుబ్రహ్మణ్యం

మల్లెలు పూసే.. వెన్నెల కాసే.. ఈ రేయి హాయిగా
మల్లెలు పూసే.. వెన్నెల కాసే.. ఈ రేయి హాయిగా
మల్లెలు పూసే.. వెన్నెల కాసే.. ఈ రేయి హాయిగా
మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా
మల్లెలు పూసే.. వెన్నెల కాసే.. ఈ రేయి హాయిగా

ముసి ముసి నవ్వులలో గుస గుస లాడినవే
నా తొలి మోజులే.. నీ విరజాజులై
ముసి ముసి నవ్వులలో గుస గుస లాడినవే
నా తొలి మోజులే.. నీ విరజాజులై
మిస మిస వన్నెలలో మిల మిల మన్నవిలే
నీ బిగి కౌగిలిలో జాబిలి రాత్రులే
కాటుకలంటుకున్న కౌగిలింత లెంత వింతలె

మనసులు పాడే మంతనమాడే ఈ పూట జంటగా
మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా

హాహా..ఆ..హాహా...హా...ఆ....ఆ...

తొలకరి కోరికలే తొందర చేసినవే
ఈ విరిశయ్యకే ఆవిరి తీరగా
తొలకరి కోరికలే తొందర చేసినవె
ఈ విరిశయ్యకే ఆవిరి తీరగా
సొగసరి కానుకలే సొద పెడుతున్నవిలే
యే తెర చాటునో ఆ చెఱ వీడగా
అందిన పొందులోనె అందలేని విందులీయవె
 కలలిక పండే కలయిక నేడే కావాలి వేయిగా

మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా

మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా
మల్లెలు పూసే వెన్నెల కా...సే.. ఈ రేయి హాయిగా


2 comments:

ఈ పాట మా వారికి చాలా ఇస్టమైన పాట..

ఓహ్ అవునా శాంతిగారు, మరి వారికి మరోసారి వినిపించారా ఈ పాటన :-) థాంక్స్ ఫర్ ద కామెంట్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.