ఆదివారం, ఏప్రిల్ 01, 2018

మావి చిగురు తినగానే...

మొన్ననే ఉగాది వచ్చివెళ్ళింది కదా ఇక వసంతానికి, మల్లెలకి, మావిళ్ళకి ఆహ్వానం పలుకుదాం ఈ నెలంతా. ముందుగా సీతామాలక్ష్మి చిత్రంలోని ఓ అందమైన పాట. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సీతామాలక్ష్మి (1978)
సంగీతం : కే. వి. మహదేవన్
సాహిత్యం : దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం : బాలు, సుశీల

మావి చిగురు తినగానే కోవిల పలికేనా
మావి చిగురు తినగానే కోయిల పలికేనా
కోవిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా
కోవిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా
ఏమో ఏమనునో గాని ఆమని ఈ వని

మావి చిగురు తినగానే కోవిల పలికేనా
కోవిల పలికేనా

తెమ్మెరతో తారాటలా తుమ్మెదతో సయ్యాటలా
తెమ్మెరతో తారాటలా తుమ్మెదతో సయ్యాటలా
తారాటలా సయ్యాటలా
సయ్యాటలా తారాటలా
వన్నెలే కాదు వగలే కాదు ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు
వన్నెలే కాదు వగలే కాదు ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు
బింకాలు బిడియాలు పొంకాలు పోడములు
ఏమో ఎవ్వరిదో గాని ఈ విరి గడసరి

మావి చిగురు తినగానే కోవిల పలికేనా
కోవిల పలికేనా

ఒకరి ఒళ్ళు ఊయ్యాలా వేరొకరి గుండె జంపాల
ఊయ్యాలా జంపాల జంపాల ఊయ్యాల
ఒకరి ఒళ్ళు ఊయ్యాలా వేరొకరి గుండె జంపాల
ఒకరి పెదవి పగడాలో వేరొకరి కనుల దివిటీలో
ఒకరి పెదవి పగడాలో వేరొకరి కనుల దివిటీలో
పలకరింతలో పులకరింతలో
పలకరింతలో పులకరింతలో
ఏమో ఏమగునో గాని ఈ కథ మన కథ

మావి చిగురు తినగానే కోవిల పలికేనా
కోవిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా
ఏమో ఏమనునో గాని ఆమని ఈ వని

మావి చిగురు తినగానే కోయిల పలికేనా ఆఆఆ..
కోయిల పలికేనా


2 comments:

ఆమని అంతా మీ బ్లాగ్ లోనే ఉంది వేణూజీ..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.