మంగళవారం, ఏప్రిల్ 17, 2018

మల్లెపువ్వులా వసంతం...

మల్లెపువ్వు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మల్లెపువ్వు (1977)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : వేటూరి
గానం : బాలు

మల్లెపువ్వులా వసంతం
మాతోట కొచ్చింది
మరపురాని పాటలా
మనసు తలుపు మూసిన వేళా

మల్లెపువ్వులా వసంతం
మాతోట కొచ్చింది


రాలిపోవు పువ్వు కూడా
రాగాలు తీసిందీ
మధువు గ్రోలి తుమ్మెద సోలి
మత్తులోన మునిగింది

మత్తులోని మధువు
మల్లె నగవు నీకు లేవులే

మల్లెపువ్వులా వసంతం
మాతోట కొచ్చింది


2 comments:

చాలా అద్భుతమైన మూవీ మల్లెపూవు(ప్యాసా..హింది లో)..అన్ని పాటలూ బావుంటాయి

అవునండీ సినిమా అండ్ అందులో అన్నిపాటలూ నాక్కూడా చాలా ఇష్టం.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతిగారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.