ఆదివారం, ఏప్రిల్ 22, 2018

వేసంకాలం వెన్నెల్లాగా...

నేనున్నాను చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : నేనున్నాను (2004)
సంగీతం : ఎమ్.ఎమ్.కీరవాణి
సాహిత్యం : సిరివెన్నెల
గానం : కె.కె, శ్రేయ ఘోషల్

వేసంకాలం వెన్నెల్లాగా వానల్లొ వాగుల్లాగ వయసు ఎవరికోసం
తోం ధిరి తోం ధిరి తోం ధిరి ధిరి ధిరి ధిరి ధిరి తోం ధిరి
శీతాకాలం ఎండల్లాగ సంక్రాతి పండుగలాగ సొగసు ఎవరికోసం
తోం ధిరి తోం ధిరి తోం ధిరి ధిరి ధిరి ధిరి ధిరి తోం ధిరి
ఓరోరి అందగాడా నన్నేలు మన్మధుడా
నీకోసం నీకోసం నీకోసం (2)
నీ సిగ్గుల వాకిట్లొ నా ముద్దుల ముగ్గేసి
నే పండుగ చేసి సందడివేళ ఆకూ వక్కా సున్నం
నీకోసం నీకోసం నీకోసం (2)

గుండె చాటుగా ఉండనందిక ఇన్నినాళ్లు దాచుకున్న కోరికా
ఉన్నపాటుగా ఆడపుట్టుకా కట్టుబాటు దాటలేదుగా
కన్నె వేడుకా విన్నవించగా అందుబాటులోనె ఉన్నానుగా
తీగచాటుగా మూగపాటగా ఆగిపోకె రాగమాలికా
నిలువెల్ల నీ జతలోన చిగురించు లతనైరానా
కొనగోటి కొంటెతనాన నిను మీటనా చెలివీణా
అమ్మమ్మో అబ్బబ్బో ఆ ముచ్చట తీరంగా నీ మెళ్లో హారంగా
నా రేకులు విచ్చేసోకులు తెచ్చి అందిస్తున్నా మొత్తం
నీకోసం నీకోసం నీకోసం (2)

సిగ్గుపోరితో నెగ్గలేవుగా ఏడుమల్లెలెత్తు సుకుమారమా
సాయమీయకా మోయలేవుగా లేత సోయగాల భారమా
కౌగిలింతగా స్వాగతించగా కోరుకున్న కొంగు బంగారమా
తాళి బొట్టుగా కాలిమెట్టెగా చేరుకోవ ప్రేమ తీరమా
మునిపంటి ముద్దరకానా చిగురంటి పెదవులపైనా
మురిపాల మువ్వను కానా దొరగారి నవ్వులలోన
నిద్దర్లొ పొద్దుల్లో నీ వద్దకు నేనొచ్చి ఆ హద్దులు దాటించి
నువ్వొద్దరలేని పద్దతిలోన ముద్దుల్నెన్నో తెచ్చా
నీకోసం నీకోసం నీకోసం (2)

వేసంకాలం వెన్నెల్లాగా వానల్లొ వాగుల్లాగ వయసు ఎవరికోసం
తోం ధిరి తోం ధిరి తోం ధిరి ధిరి ధిరి ధిరి ధిరి తోం ధిరి
శీతాకాలం ఎండల్లాగ సంక్రాతి పండుగలాగ సొగసు ఎవరికోసం
తోం ధిరి తోం ధిరి తోం ధిరి ధిరి ధిరి ధిరి ధిరి తోం ధిరి
ఓరోరి అందగాడా నన్నేలు మన్మధుడా
నీకోసం నీకోసం నీకోసం నీకోసం నీకోసం నీకోసం
నీకోసం నీకోసం నీకోసం నీకోసం నీకోసం

2 comments:

బ్యూటిఫుల్ శ్రేయ..యెలిగెంట్ కాస్ట్యూంస్..

అవును శాంతి గారు.. థాంక్స్ ఫర్ యువర్ కామెంట్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.