సోమవారం, ఏప్రిల్ 09, 2018

మల్లెపూల వానా...

వినోదం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : వినోదం (1996)
సంగీతం : ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం : సిరివెన్నెల
గానం : ఎస్.పి.బాలు, కె.ఎస్.చిత్ర

ఆ... మల్లెపూల వానా
మల్లెపూల వానా...
మల్లెపూల వానా
జల్లులోనా
తడిసిన ఆనందాన
పలికెను మది వీణా

భయం లేదు పదరా
అని పలికిందిరా నా మైనా
మల్లెపూల వాన... వాన... వాన...
వాన... వాన...

జయం మనిది కదరా
మనమనుకున్నది జరిగేరా

 మల్లెపూల వాన... వాన... వాన...
వాన... వాన..

భయం లేదు పదరా
అని పలికిందిరా నా మైనా
మల్లెపూల వాన... వాన... వాన...
వాన... వాన...

జయం మనిది కదరా
మనమనుకున్నది జరిగేరా
 

దొరకును దొరకూన హో...
ఎదురెవరురా మనకీవేళలోన

మల్లెపూల వానా...
మల్లెపూల వానా
జల్లులోనా
తడిసిన ఆనందాన
పలికెను మది వీణా

ఓయమ్మా ఈ రోజునా
వద్దనకమ్మా ఏం చేసినా
నా పాదాలే పరుగులు తీసే
గోదారి అలలౌతుంటే
ఆగేనా ఎవ్వరాపినా
అష్టసిరులు నిను ఇష్టపడెనురా
కష్టపడితె జత కట్టవచ్చురా

 

గ్రహాలన్ని మనకే
అనుకూలిస్తున్నవి గనక
మహారాజులాగ
వేశానుర కోటలో పాగా
పాచిక వేశాకా
పారక పోదురా
నూరారు అయినా 

మల్లెపూల వానా...
మల్లెపూల వానా
జల్లులోనా
తడిసిన ఆనందాన
పలికెను మది వీణా
  
మబ్బుల్లో ఆ జాబిలీ
నా జతకోసం రావాలనీ
ఓ చిటికేసి పిలవంగానే
ఇటుకేసి వస్తున్నాడె నా జళ్లో చేరాలనీ
ప్రేమయాత్రలో పక్కదారులు
ఎంత మాత్రమూ తప్పుకాదురా

రథం నడుపుతారా
మా మామను కూర్చోబెట్టి
ఎటెళ్లాలో చెబుతా
కళ్లాలను చేత్తో బట్టి
అల్లుడినైపోగా హా.. చల్లగ
నా కాళ్లు కడిగించుకోనా

 మల్లెపూల వానా...
మల్లెపూల వానా
జల్లులోనా
తడిసిన ఆనందాన
పలికెను మది వీణా

భయం లేదు పదరా
అని పలికిందిరా నా మైనా
మల్లెపూల వాన... వాన... వాన...
వాన... వాన...

జయం మనిది కదరా
మనమనుకున్నది జరిగేరా 

 మల్లెపూల వాన... వాన... వాన...
వాన... వాన...

భయం లేదు పదరా
అని పలికిందిరా నా మైనా
జయం మనిది కదరా
మనమనుకున్నది జరిగేరా 
 దొరకును దొరకూన హో...
ఎదురెవరురా మనకీవేళలోన
  
 

2 comments:

మా పెరటి జాచెట్టు పాటంతా రాఘవేంద్రరావ్ గారి మాయాజాలమే కనిపిస్తుంది..ఈ అమ్మాయి కాస్త చూడబుల్ గా అనిపించిన మూవీ ఇదొక్కటే అనిపిస్తుంది నాకు..

రాఘవేంద్రరావు మాయాజాలమైనా ఆ సినిమాలోనే నాకు నచ్చుతుందండీ.. ఈ సినిమాలో కామెడీ ముందు ఇంకెవరూ కనిపించరు నాకు :-) థాంక్స్ ఫర్ ద కామెంట్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.