శుక్రవారం, ఏప్రిల్ 20, 2018

వసంతమా వరించుమా...

గిల్లికజ్జాలు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : గిల్లికజ్జాలు (1998)
సంగీతం : కోటి
సాహిత్యం : సిరివెన్నెల
గానం : యస్. పి. బాలు, సునీత

ప్రపంచమా క్షమించుమా మాకు నీతో పనేమీ లేదమ్మా
వసంతమా వరించుమా స్వాగతాంజలి స్వీకరించమ్మా
కాంచన కాంతులు భామ నీ కంచెలు తెంచుకు రామ్మా
కాంక్షలు పెంచిన ప్రేమ నీ పంచనె మా చిరునామా
ఈ ఏకాంతం మనదే స్నేహమా...

వసంతమా వరించుమా స్వాగతాంజలి స్వీకరించమ్మా

కుడి ఎడమలు ఎరగక మన కథ సాగేనంటా
జత కుదరని ఎదలకు పెరుగగ ఏదో మంటా
ఎవరెవరికొ ఎద రగిలితే అది మనకేమంటా
కనులడిగిన కలలను తరుముతు పోదామంటా
మనకు మనకు గల ముచ్చట 
మరి ఎవరు కనని చోటెచ్చట
ముడులు విడని బిగి కౌగిట 
తగు విడిది మనకు దొరికేనట
మరి ఆలస్యం ఇంకా ఎంటటా...

ప్రపంచమా క్షమించుమా మాకు నీతో పనేమీ లేదమ్మా

తెరమరుగున నిలువక చొరవగ రారమ్మంటా
అరమరికలు తెలియని చెలిమిని అందిమ్మంటా
కలవర పడు గుస గుస కబురును విన్నానంటా
మనసెరిగిన వరుసకు సరసనె ఉన్నానంటా
ఉరుము వెనుక జడి వానలా 
ఈ విరహమంత కరిగేదెలా
దిగులు పడకు నువ్వంతలా 
తొలి వలపు తెగని విరి సంకెలా
మరి దూరంగా ఉంటే ఇంకెలా...

వసంతమా వరించుమా స్వాగతాంజలి స్వీకరించమ్మా
కాంచన కాంతులు భామ నీ కంచెలు తెంచుకు రామ్మా
కాంక్షలు పెంచిన ప్రేమ నీ పంచనె మా చిరునామా
ఈ ఏకాంతం మనదే స్నేహమా...


2 comments:

నిజంగానే చక్కని పాట..

అవును శాంతి గారు.. థాంక్స్ ఫర్ ద కామెంట్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.