శుక్రవారం, ఏప్రిల్ 27, 2018

మామిడి కొమ్మకు మా చిలకమ్మకు...

ఆవకాయ్ బిర్యానీ చిత్రంలోని ఒక కమ్మని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఆవకాయ్ బిర్యాని (2000)
సంగీతం : మణికాంత్ కద్రి
సాహిత్యం : వనమాలి
గానం : మణికాంత్ కద్రి, సైంధవి

మామిడి కొమ్మకు మా చిలకమ్మకు పొత్తే కుదిరింది..
కమ్మని రుచులే పంచే కనులకు పొద్దే పొడిచిందీ.. ఓఓఓఓ..ఓ..
మామిడి కొమ్మకు మాచిలకమ్మకు పొత్తే కుదిరింది..
కమ్మని రుచులే పంచే కనులకు పొద్దే పొడిచిందీ.. ఓఓఓఓ..ఓ..
మ్మ్..కొత్తావకాయే తనకంటి ఎరుపాయే..
ముంగిళ్ళలో మురిపాలే మూతి విరుపాయే..
కారాలు నూరే..సందళ్ళు కొలువాయే..
కాలాలు మారే కథలే ఇక మొదలాయే..


గువ్వల్లే దూసుకు వచ్చే గడసరి అబ్బాయీ..
గుండెల్లో ఆశలు ఉన్నాయీ..
కళ్ళల్లొ తీయని కలలే తెచ్చిన అమ్మాయీ..
నీకోసం నా చిరునవ్వులు వేంచేస్తున్నాయీ..

ఏ నదితో ఏ వైరం..ఈ నావను వెంటాడిందో..
ఒంటరిగా చేరిందీ తీరం..
గుండెల్లో ఈ భారం..ఎందాకా నడిపిస్తుందో..
తేల్చదుగా ఎన్నటికీ దూరం..

దారే పూలే పరిచీ కడదాకా నిన్నే రమ్మంటే..
చేరే గమ్యం ఎంతో గొప్పైనా అర్థం ఉంటుందా..
పోరాటం లేనే లేని ఏ క్షణమైనా నీదౌతుందా..
తెగువే ఉంటె గెలుపే సైతం నీతో నీడై రాదా..

గువ్వల్లే దూసుకు వచ్చే గడసరి అబ్బాయీ..
గుండెల్లో ఆశలు ఉన్నాయీ..
కళ్ళల్లొ తీయని కలలే తెచ్చిన అమ్మాయీ..
నీకోసం నా చిరునవ్వులు వేంచేస్తున్నాయీ..

ఏ ఓటమి ఎదురైనా..ఆశే మీ వెన్నంటేనా..
వేకువకై పరుగే ఆగేనా..
చినుకల్లే మొదలైనా..చిగురించిన పరిచయమేదో..
చివరికి ఆ సంద్రంగా మారేనా..

నింగీ నేల రెండు ఎపుడైనా కలిసే వీలుందా..
పొంగే వానే వంతెన వేసిందా ఆ కల నిజమవదా..
ఏనాడు కలవని దిక్కులు కలిసిన వింతలు
కంటికి ఎన్నొ కనబడలేదా..
చీకటి వెలుగులు గీసిన చిత్రం నీదే..

గువ్వల్లే దూసుకు వచ్చే గడసరి అబ్బాయీ..
గుండెల్లో ఆశలు ఉన్నాయీ..
కళ్ళల్లొ తీయని కలలే తెచ్చిన అమ్మాయీ..
నీకోసం నా చిరునవ్వులు వేంచేస్తున్నాయీ. 


2 comments:

పిక్ భలే ఉందండి..వెరీ పోయిటిక్..

థాంక్స్ శాంతి గారు... ఈ పాట కూడా నాకు చాలా ఇష్టమండీ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.