సోమవారం, ఏప్రిల్ 30, 2018

కోకిలమ్మ పెళ్ళికీ...

అడవిరాముడు చిత్రంలోని ఒక చక్కని పాటతో ఈ నెల సిరీస్ ను ముగిద్దాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అడవిరాముడు (1977)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, సుశీల

కుకు కుకు కుకు కుకు
కోకిలమ్మ పెళ్ళికీ కోనంతా పందిరి
చిగురాకులు తోరణాలు చిరుగాలి సన్నాయి

డుడుం డుడుం డుడుం డుడుం
వసంతుడే పెళ్ళికొడుకు వనమంతా సందడి
పూలన్నీ తలంబ్రాలు పున్నమీ తొలిరేయి

తుళ్ళి తుళ్ళి నిన్నమొన్న తూనీగల్లే ఎగిరిన
పిల్లదానికొచ్చిందీ కళా...పెళ్ళి కళా
తలపులన్ని వలపులైన చూపులు విరితూపులైన
పెళ్ళికొడుకు నవ్వితే తళా... తళతళా
పూలగాలితో రేగిన పుప్పొడి పారాణిగా
చిలకపాట నెమలి ఆట కలిసి మేజువాణిగా
పూలగాలితో రేగిన పుప్పొడి పారాణిగా
చిలకపాట నెమలి ఆట కలిసి మేజువాణిగా
అందమైన పెళ్ళికి అందరు పేరంటాలే
అడవిలోని వాగులన్ని ఆనందపు కెరటాలే

కుకు కుకు కుకు కుకు
కోకిలమ్మ పెళ్ళికీ కోనంతా పందిరి
చిగురాకులు తోరణాలు చిరుగాలి సన్నాయి

కన్ను కన్ను కలుపుకున్న కన్నెమనసు
తెలుసుకున్న కనుల నీలినీడలే కథా... ప్రేమకథా
బుగ్గలలో నిగ్గుదీసి సిగ్గులలో చిలకరించు
మొగ్గవలపు విచ్చితే కథా...పెళ్ళి కథా
ఇరుమనసుల కొకతనువై ఇరుతనువులకొక మనువై
మనసులోని వలపులన్ని మల్లెల విరిపానుపులై
ఇరుమనసుల కొకతనువై ఇరుతనువులకొక మనువై
మనసులోని వలపులన్ని మల్లెల విరిపానుపులై
కలిసివున్న నూరేళ్ళు కలలుగన్న వెయ్యేళ్ళు
మూడుముళ్ళు పడిననాడు ఎదలు పూలపొదరిళ్ళు

కుకు కుకు కుకు కుకు
కోకిలమ్మ పెళ్ళికీ కోనంతా పందిరి
చిగురాకులు తోరణాలు చిరుగాలి సన్నాయి

డుడుం డుడుం డుడుం డుడుం
వసంతుడే పెళ్ళికొడుకు వనమంతా సందడి
పూలన్నీ తలంబ్రాలు పున్నమీ తొలిరేయి

కుకు కుకు కుకు కుకు
డుడుం డుడుం డుడుం డుడుం
కుకు కుకు కుకు కుకు
డుడుం డుడుం డుడుం డుడుం 



2 comments:

యే టైం లోనైనా విని ఎంజాయ్ చేసే పాటలలో ఇదీ ఒకటండి..

అవును శాంతిగారు.. మహదేవన్ గారి సంగీతం గొప్పదనమే అదేమో.. థాంక్స్ ఫర్ ద కామెంట్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.