బుధవారం, ఏప్రిల్ 18, 2018

నవ్వింది మల్లెచెండు...

అభిలాష చిత్రంలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అభిలాష (1983)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి

యురేకా...హహ్హాహ్హా...
తార తతార తతారత్తా... తార తతార తతారత్తా...
హహ్హాహ్హా... హహ్హాహ్హా... హే...
నవ్వింది మల్లెచెండు నచ్చింది గర్ల్‌ఫ్రెండు
దొరికెరా మజాగ ఛాన్సు జరుపుకో భలే రొమాన్సు
యురేకా సకమిక... నీ ముద్దు తీరేదాక
నవ్వింది మల్లెచెండు నచ్చింది గర్ల్‌ఫ్రెండు
దొరికెరా మజాగ ఛాన్సు జరుపుకో భలే రొమాన్సు
యురేకా సకమిక... సకమిక సకమిక సకమిక సకమిక


లవ్వు సిగ్నల్ నాకివ్వగానే 
నవ్వుకున్నాయ్ నా యువ్వనాలే
ఆ నవ్వుతోనే కదిలెయ్యుగానే 
నాటుకున్నయ్ నవనందనాలే
అహా చూపుల్లో నీ రూపం కనురెప్పల్లో నీ ప్రాణం
కన్నుకొట్టి కమ్ముకుంట.. కాలమంత అమ్ముకుంట
రపప్ప రపప్ప రపప్ప రపప్ప
కన్నె ఈడు జున్నులన్నీ జుర్రుకుంటా

నవ్వింది మల్లెచెండు నచ్చింది గర్ల్‌ఫ్రెండు
దొరికెరా మజాగ ఛాన్సు జరుపుకో భలే రొమాన్సు
యురేకా సకమిక...


కస్సుమన్న ఓ కన్నెపిల్ల యుస్సు అంటే ఓ కౌగిలింత
కిస్సులిచ్చి నే కౌగిలిస్తే అరె తీరిపోయే నాకున్న చింత
నేను పుట్టిందే నీ కోసం ఈ జన్మంతా నీ ధ్యానం
ముద్దు పెట్టి మొక్కుకుంట మూడు ముళ్ళు వేసుకుంట
సబబ్బా రిబబ్బా సబబ్బా సబరిబరబ...
ఏడు జన్మలేలుకుంట నేను జంటగా

నవ్వింది మల్లెచెండు నచ్చింది గర్ల్‌ఫ్రెండు
దొరికెరా మజాగ ఛాన్సు జరుపుకో భలే రొమాన్సు
యురేకా సకమిక... నీ ముద్దు తీరేదాక...
యురేకా సకమిక... నీ ముద్దు తీరేదాక...
యురేకా సకమిక... నీ ముద్దు తీరేదాక... 

 

2 comments:

ఫావరెట్ సాంగ్..

నాక్కూడా శాంతి గారు.. మాంచి హుషారైన పాట. థాంక్స్ ఫర్ ద కామెంట్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.