నిన్నే ప్రేమిస్తా చిత్రం నుండి ఒక మంచి పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : నిన్నే ప్రేమిస్తా (2000)
సంగీతం : S.A.రాజ్ కుమార్
సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : బాలు, చిత్ర
కోయిల పాట బాగుందా కొమ్మలసడి బాగుందా
పున్నమితోట బాగుందా వెన్నెల సిరి బాగుందా
కోయిల పాట బాగుందా కొమ్మలసడి బాగుందా
పున్నమితోట బాగుందా వెన్నెల సిరి బాగుందా
అందమైన మల్లె బాల బాగుందా
అల్లి బిల్లి మేఘమాల బాగుందా
చిలకమ్మా చెప్పమ్మా చిరుగాలి చెప్పమ్మా
కోయిల పాట బాగుందా కొమ్మలసడి బాగుందా
పున్నమితోట బాగుందా వెన్నెల సిరి బాగుందా
అప్పుడిప్పుడు గున్నమామి తోటలో
అట్లతద్ది ఊయలూగినట్లుగా
ఇప్పుడెందుకో అర్థరాత్రి వేళలో
గుర్తుకొస్తోంది కొత్త కొత్తగా
నిదురించిన ఎద నదిలో
అల లెగిసిన అలజడిగా
తీపితీపి చేదు ఇదా లేతపూల ఉగాది ఇదా
చిలకమ్మా చెప్పమ్మ చిరుగాలి చెప్పమ్మా
కోయిల పాట బాగుందా కొమ్మలసడి బాగుందా
పున్నమితోట బాగుందా వెన్నెల సిరి బాగుందా
మబ్బు చాటులో వున్న వెన్నెలమ్మకి
బుగ్గచుక్కలాగా వున్న తారక
కొబ్బరాకుతో అల్లుకున్న బొమ్మకి
పెళ్లి చుక్కపెట్టినట్టు వుందిగా
కలలు కనే కన్నులలో
కునుకెరుగని కలవరమా
రేయిలోని పలవరమా హాయిలోని పరవశమా
చిలకమ్మా చెప్పమ్మా చిరుగాలి చెప్పమ్మా
కోయిల పాట బాగుంది కొమ్మల సడి బాగుంది
పున్నమితోట బాగుంది వెన్నెలసిరి బాగుంది
అందమైన మల్లె బాలబాగుంది
అల్లి బిల్లి మేఘమాల బాగుంది
చిలకమ్మా బాగుంది చిరుగాలి బాగుంది
కోయిల పాట బాగుందా కొమ్మలసడి బాగుందా
పున్నమితోట బాగుందా వెన్నెల సిరి బాగుందా
2 comments:
రాజ్ కుమార్ మార్క్ సాంగ్..
అవునండీ టిపికల్ స్టైల్.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.