సోమవారం, ఏప్రిల్ 23, 2018

కూహూ కూయవా...

అదృష్టం చిత్రం నుండి ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అదృష్ణం (1992)
సంగీతం : ఆనంద్ మిలింద్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు, చిత్ర

కూహూ కూయవా కోయిలా
ఊహూ మానవా మౌనివా
కూహూ కూయవా కోయిలా
ఊహూ మానవా మౌనివా
పాట విననీవా మోమాట పడతావా
మూతిముడిచి కూతలన్నీ మూత పెడతావా గువ్వా
అన్నానని కాదు గాని అనురాగం అణిచేవా
అదిరే ఆ పెదవుల్లో ఆనందం అదిమేవా

కూహూ కూయవా కోయిలా
ఊహూ మానవా మౌనివా
పాట విననీవా మోమాట పడతావా
మూతిముడిచి కూతలన్నీ మూత పెడతావా గువ్వా
అన్నానని కాదు గాని అనురాగం అణిచేవా
అదిరే ఆ పెదవుల్లో ఆనందం అదిమేవా

అడుగమ్మా కావాలంటే నీ గుండెల గుబగుబనీ
ఏమూలో వినిపిస్తుందీ నీ ఆశల పల్లవినీ
గుండెల్లో గుసగుసలన్నీ గుంభనగా ఉండనీ
అందరికీ తెలిసిందంటే అల్లరి పడిపోవాలీ

మంచిమాటతో చెబితే వినవా చండికా
ఏయ్ చెంప ఛెళ్ళునా కొడితే దారికి చేరవా..
కోపాలా గోపాలా ఓపని తాపాలా పాపం

అన్నానని కాదు గాని అనురాగం అణిచేవా
అదిరే ఆ పెదవుల్లో ఆనందం అదిమేవా

కలతోనే కాపురముంటే నడిరాతిరి కరిగేనా
కథలోనీ మలుపులు వింటే కాలం కొనసాగేనా

కలనైనా తోసుకువచ్చే సాక్ష్యంగా నే లేనా
కథలైనా కావ్యాలైనా మనకోసం అనుకోనా
ప్రేమ ముదిరితే పిచ్చే తెలుసా పరుగు మానుకో
పళ్ళు రాలితే పైత్యం దిగదా
పంతం ఎందుకో
ఛీ అన్నా ఛా అన్నా సరసం అనుకోనా గువా

అన్నానని కాదు గాని అనురాగం అణిచేవా
అదిరే ఆ పెదవుల్లో ఆనందం అదిమేవా

కూహూ కూయవా కోయిలా
ఊహూ మానవా మౌనివా
పాట విననీవా మోమాట పడతావా
మూతిముడిచి కూతలన్నీ మూత పెడతావా గువ్వా
అన్నానని కాదు గాని అనురాగం అణిచేవా
అదిరే ఆ పెదవుల్లో ఆనందం అదిమేవా 

 

2 comments:

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.