అబ్బాయిగారు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : అబ్బాయిగారు (1993)
సంగీతం : ఎమ్.ఎమ్.కీరవాణి
సాహిత్యం : భువనచంద్ర
గానం : బాలు, చిత్ర
కూసింది కోయిలమ్మ కుకు కుకు కుకు కుకు కుకు
కులికింది కూనలమ్మ కుకు కుకు కుకు కుకు కుకు
ముసి ముసి నవ్వుల మీనా దయరాద నా పైన
బిగి కౌగిట ఊయలలుగాలమ్మ...
కూసింది కోయిలమ్మ కుకు కుకు కుకు కుకు కుకు
కవ్వింత లెందుకమ్మ కుకు కుకు కుకు కుకు కుకు
కావాలా ఒక చుమ్మా ఇస్తాలే ఇటు రమ్మా
తడి ఆరని పెదవులు నీకేనమ్మా...
చేరగనే చెలి చెంత అదియేమో పులకింత
వళ్ళంత తుళ్లింతా నీదేలే వలపంతా
చేరగనే చెలి చెంత అదియేమో పులకింత
ఆ వళ్ళంత తుళ్లింతా నీదేలే వలపంతా
అందాలే అనుబంధాలై
మొహాలే మకరందా లై
వెన్ను తట్టి తట్టి లేపుతుంటే ఆగలేను అమ్మడు
ముద్దులెన్నో లెక్క పెట్టమంటా
లెక్కపెట్టే నిన్ను చుట్టుకుంటా
కూసింది కోయిలమ్మ కుకు కుకు కుకు కుకు కుకు
కులికింది కూనలమ్మ కుకు కుకు కుకు కుకు కుకు
కావాలా ఒక చుమ్మా ఇస్తాలే ఇటు రమ్మా
బిగి కౌగిట ఊయలలుగాలమ్మ...
కూసింది కోయిలమ్మ కుకు కుకు కుకు కుకు కుకు
కవ్వింత లెందుకమ్మ కుకు కుకు కుకు కుకు కుకు
నా ఎదలో పై ఎదలో పరువాలా పందిరిలో
ఆ సడిలో నీ ఒడిలో సరసాలా తొందరలో
నా ఎదలో పై ఎదలో పరువాలా పందిరిలో
ఆ ఆ సడిలో నీ ఒడిలో సరసాలా తొందరలో
వేకువనై నిను కోరుకునే
రాతిరినై నే మేలుకొని
ఎదో పట్టు పట్టి అడుగుతుంటే ఏమంటాను పిల్లడా
అమ్మదొంగా ఇట్టా వచ్చేమరి
నిమ్మళంగా జోడు కట్టేమరి
కూసింది కోయిలమ్మ కుకు కుకు కుకు కుకు కుకు
కవ్వింత లెందుకమ్మ కుకు కుకు కుకు కుకు కుకు
ముసి ముసి నవ్వుల మీనా దయరాద నా పైన
తడి ఆరని పెదవులు నీకేనమ్మా...
కూసింది కోయిలమ్మ కుకు కుకు కుకు కుకు కుకు
కవ్వింత లెందుకమ్మ
2 comments:
ఈ మూవీ ముందు తమిళ్ లో చూశాము..భాగ్యరాజ..చాలా బావుంది..నైస్ సాంగ్..
ఓహ్ నేను తమిళ్ వర్షన్ చూళ్ళేదండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.