శుక్రవారం, ఏప్రిల్ 13, 2018

ఇది ఒక నందనవనము...

అడవిదొంగ చిత్రంలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అడవి దొంగ (1985)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి

ఇది ఒక నందనవనము
ఉవ్వా..ఉవువ్వా.. ఉవ్వా..ఉవువ్వా
మనసులు కలిపిన దినము
ఉవ్వా..ఉవువ్వా.. ఉవ్వా..ఉవువ్వా

తరుల గిరుల ఋతు శోభలతో
ఉవ్వా..ఉవువ్వా.. ఉవ్వా..ఉవువ్వా
తరుణ హరిణ జతి నాట్యముతో
ఉవ్వా..ఉవువ్వా.. ఉవ్వా..ఉవువ్వా

కొతకొత్తపాటలెన్నో కోయిలమ్మ నేర్చుకున్న వేళా
ఉవ్వా..ఉవ్వా.. ఉవువ్వా.. ఉవ్వా ఉవ్వా..ఉవువ్వా

ఏటిలోని తీట నీరు ఏనుగమ్మ లాలపోసే
ఉవ్వా..ఉవువ్వా.. ఉవ్వా..ఉవువ్వా
చుర్రుమన్న కొండ ఎండ ఎర్రననైన బొట్టు పెట్టే
ఉవ్వా..ఉవువ్వా.. ఉవ్వా..ఉవువ్వా

చిలక గోపికలు చీరకట్టినవి
ఉవ్వా..ఉవువ్వా.. ఉవ్వా..ఉవువ్వా
పాలపిట్టలిడ గూడు కట్టినవి
ఉవ్వా..ఉవువ్వా.. ఉవ్వా..ఉవువ్వా

చెవులపిల్లి చెప్పుకున్న ఊసువిన్నది
కోతిబావ చెప్పుకుంది చెయ్యమన్నది
హేయ్.. చేసుకో వేడిగా వేడుకా...
ఉవ్వా..ఉవ్వా.. ఉవువ్వా.. ఉవ్వా ఉవ్వా..ఉవువ్వా

ఇది ఒక నందనవనము
ఉవ్వా..ఉవువ్వా.. ఉవ్వా..ఉవువ్వా
మనసులు కలిపిన దినము
ఉవ్వా..ఉవువ్వా.. ఉవ్వా..ఉవువ్వా

ఒంటి మీద చెయ్యి వేస్తే వయసుకొక్క ఊపు వచ్చే
ఉవ్వా..ఉవువ్వా.. ఉవ్వా..ఉవువ్వా
ఊపు మీద నిన్ను చూస్తే రేపు లేని రేతిరొచ్చే
ఉవ్వా..ఉవువ్వా.. ఉవ్వా..ఉవువ్వా
సిగనుపువ్వులే చెదిరిపోయినవి
ఉవ్వా..ఉవువ్వా.. ఉవ్వా..ఉవువ్వా
సిగ్గుమరకలే చెరిగిపోయినవి
ఉవ్వా..ఉవువ్వా.. ఉవ్వా..ఉవువ్వా

పోనుపోను గుట్టు నాకు దొరుకుతున్నది
రాను రాను పట్టు నాకు తప్పుతున్నది
హేయ్.. తీరనీ తీయనీ కోరికా..
ఉవ్వా..ఉవ్వా.. ఉవువ్వా..
ఉవ్వా ఉవ్వా..ఉవువ్వా

ఇది ఒక నందనవనము
ఉవ్వా..ఉవువ్వా.. ఉవ్వా..ఉవువ్వా
మనసులు కలిపిన దినము
ఉవ్వా..ఉవువ్వా.. ఉవ్వా..ఉవువ్వా

తరుల గిరుల ఋతు శోభలతో
ఉవ్వా..ఉవువ్వా.. ఉవ్వా..ఉవువ్వా
తరుణ హరిణ జతి నాట్యముతో
ఉవ్వా..ఉవువ్వా.. ఉవ్వా..ఉవువ్వా

కొతకొత్తపాటలెన్నో కోయిలమ్మ నేర్చుకున్న వేళా..
ఉవ్వా..ఉవ్వా.. ఉవువ్వా.. ఉవ్వా ఉవ్వా..ఉవువ్వా

 ఇది ఒక నందనవనము
ఉవ్వా..ఉవువ్వా.. ఉవ్వా..ఉవువ్వా
మనసులు కలిపిన దినము
ఉవ్వా..ఉవువ్వా.. ఉవ్వా..ఉవువ్వా 

 

2 comments:

బ్యూటిఫుల్ యెండ్ కలర్ ఫుల్ సాంగ్..

అవును శాంతి గారు.. థాంక్స్ ఫర్ ద కామెంట్..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.