శనివారం, మార్చి 31, 2018

ప్రియతమా నను పలకరించు...

శ్రీదేవి పాటల సిరీస్ లో చివరగా జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రంలోని ఒక మంచి మెలోడీని తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : జగదేకవీరుడు అతిలోకసుందరి (1990)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి

ప్రియతమా నను పలకరించు ప్రణయమా
అతిథిలా నను చేరుకున్న హృదయమా
బ్రతుకులోని బంధమా పలుకలేని భావమా
మరువలేని స్నేహమా మరలిరాని నేస్తమా
ప్రియతమా.. ప్రియతమా.. ప్రియతమా


ప్రియతమా నను పలకరించు ప్రణయమా
అతిథిలా నను చేరుకున్న హృదయమా
ఎదుటవున్న స్వర్గమా చెదిరిపోని స్వప్నమా
కనులలోని కావ్యమా కౌగిలింత ప్రాణమా
ప్రియతమా.. ప్రియతమా.. ప్రియతమా..

నింగి వీణకేమో నేల పాటలొచ్చె
తెలుగు జిలుగు అన్నీ తెలిసి
పారిజాతపువ్వు పచ్చి మల్లె మొగ్గ
వలపె తెలిపే నాలో విరిసి

మచ్చలెన్నో ఉన్న చందమామకన్నా
నరుడే వరుడై నాలో మెరిసే
తారలమ్మకన్నా చీరకట్టుకున్న
పడుచుతనమే నాలో మురిసే


మబ్బులనీ వీడిపోయి కలిసే నయనం తెలిసే హృదయం
తారలన్నీ దాటగానే తగిలే గగనం.. రగిలే విరహం
రాయలేని భాషలో ఎన్ని ప్రేమలేఖలో
రాయిలాంటి గొంతులో ఎన్ని మూగపాటలో
అడుగే పడక గడువే గడిచి పిలిచే


ప్రియతమా నను పలకరించు ప్రణయమా
అతిథిలా నను చేరుకున్న హృదయమా

ప్రాణవాయువేదో వేణువూదిపోయే
శృతిలో జతిలో నిన్నే కలిపి
దేవగానమంత ఎంకి పాటలాయే
మనసు మమత అన్నీ కలిసి


వెన్నెలల్లె వచ్చి వేదమంత్రమాయే
బహుశా మనసా వాచా వలచి
మేనకల్లే వచ్చి జానకల్లే మారె
కులము గుణము అన్నీ కుదిరి

నీవులేని నింగిలోన వెలిగే ఉదయం విధికే విలయం
నీవులేని నేలమీద బ్రతుకే ప్రళయం మనసే మరణం
వానవిల్లు గుండెలో నీటికెన్ని రంగులో
అమృతాల విందులో ఎందుకిన్ని హద్దులో
జగమే అణువై యుగమే క్షణమై మిగిలే

ప్రియతమా నను పలకరించు ప్రణయమా
అతిథిలా నను చేరుకున్న హృదయమా
బ్రతుకులోని బంధమా పలుకలేని భావమా
కనులలోని కావ్యమా కౌగిలింత ప్రాణమా
ప్రియతమా.. ప్రియతమా.. ప్రియతమా

ప్రియతమా నను పలకరించు ప్రణయమా
అతిథిలా నను చేరుకున్న హృదయమా

 

2 comments:

యే గ్రేట్ ట్రిబ్యూట్ టు శ్రీదేవి అండి..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.