శుక్రవారం, మార్చి 09, 2018

ఎదలో తొలి వలపే...

తెరముందు నటీనటులతో పోటీ పడి పాత్రలలో ఒదిగిపోతే తప్ప ఇంత నప్పేట్లుగా పాడటం సాధ్యం కాదేమో ఈ చక్కని పాటను మీరూ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే కావాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : ఎర్ర గులాబీలు (1979)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం: ఎస్.పి.బాలు, ఎస్.జానకి

లలలలల లా..
ఎదలో తొలి వలపే విరహం జత కలిసే
మధురం ఆ తలపే నీ పిలుపే..ఏ..ఏ

ఎదలో తొలి వలపే విరహం జత కలిసే
మధురం ఆ తలపే నీ పిలుపే..ఏ..ఏ

ఎదలో తొలి వలపే..

రోజాలతో పూజించనీ.. 
విరి తెనెలే నను తాగనీ
నా యవ్వనం పులకించనీ.. 
అనురాగమే పలికించనీ
కలగన్నదీ నిజమైనదీ..
కధలే నడిపిందీ..ఈ..ఈ..

ఎదలో తొలి వలపే విరహం జత కలిసే
మధురం ఆ తలపే నీ పిలుపే..ఏ..ఏ

ఎదలో తొలి వలపే..

పయనించనా నీ బాటలో.. 
మురిపించనా నా ప్రేమలో
ఈ కమ్మనీ తొలి రేయిని.. 
కొనసాగనీ మన జంటనీ
మోహాలలో మన ఊహలే..
సాగే చెలరేగే..ఏ..ఏ..

ఎదలో తొలి వలపే విరహం జత కలిసే
మధురం ఆ తలపే నీ పిలుపే..ఏ..ఏ

ఎదలో తొలి వలపే విరహం జత కలిసే
మధురం ఆ తలపే నీ పిలుపే..ఏ..ఏ

ఎదలో తొలి వలపే..
 

3 comments:

వన్ ఆఫ్ మై మోస్ట్ ఫావరెట్ సాంగ్స్..యెన్ని సార్లు విన్నా ఈ పాట వింటూనే ఉండాలనిపిస్తుంది..థాంక్యూ ఫర్ పోస్టింగ్..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు.

this is song is not written by Sri Veturi, pl check the titles

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.