శుక్రవారం, మార్చి 30, 2018

తెల్లచీరకు తకధిమి...

ఆఖరిపోరాటం చిత్రంలోని ఒక అందమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఆఖరి పోరాటం (1988)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, లతా మంగేష్కర్

తెల్లచీరకు తకధిమి తపనలు
రేగేనమ్మా సందె ఎన్నెల్లో

సిరిమల్లె పూలకు సరిగమ ఘుమఘుమ
తాకేనమ్మ జంట ముద్దుల్లో
అవే తీయనీ సరాగాలుగా
ఇలా హాయిగా స్వరాలూదగా
సన్నాయంటి వయ్యారంలో సాయంత్రాలే సంగీతాలై

మల్లెపూలకు సరిగమ ఘుమఘుమ
తాకేనమ్మ జంట ముద్దుల్లో
అహ తెల్లచీరకు తకధిమి తపనలు
రేగేనమ్మా సందె ఎన్నెల్లో


వైశాఖం తరుముతుంటే
నీ ఒళ్ళో ఒదుగుతున్నా

 ఆషాఢం ఉరుముతుంటే
నీ మెరుపే చిదుముకున్నా
కవ్వింతలో వాలి పువ్వంత కావాలి
పండించుకోవాలి ఈ బంధమే

నీతోడు కావాలి నే తోడుకోవాలి
నీ నీడలో ఉన్న శృంగారమే
జాబిల్లీ... సూరీడూ... ఆకాశంలో నిండిన సొగసుల

తెల్లచీరకు తకధిమి తపనలు
రేగేనమ్మా సందె ఎన్నెల్లో
సిరిమల్లె పూలకు సరిగమ ఘుమఘుమ
తాకేనమ్మ జంట ముద్దుల్లో


కార్తీకం అహ్.. కలిసి వస్తే
నీ పరువం అడుగుతున్నా

హేమంతం కరుగుతుంటే
నీ అందం కడుగుతున్నా
ఆకాశ దేశాన ఆ మేఘరాగాలు
పలికాయి నా స్వప్నసంగీతమే

ఈ చైత్రమాసాల చిరునవ్వు దీపాలు
వెలిగాయి నీ కంట నాకోసమే
గిలిగింతే... గీతాలై... సింగారానికి సిగ్గులు కలిపిన

తెల్లచీరకు తకధిమి తపనలు
రేగేనమ్మా సందె ఎన్నెల్లో
సిరిమల్లె పూలకు సరిగమ ఘుమఘుమ
తాకేనమ్మ జంట ముద్దుల్లో

అవే తీయనీ సరాగాలుగా
ఇలా హాయిగా స్వరాలూదగా
సన్నాయంటి వయ్యారంలో సాయంత్రాలే సంగీతాలై

తెల్లచీరకు తకధిమి తపనలు
రేగేనమ్మా సందె ఎన్నెల్లో
సిరిమల్లె పూలకు సరిగమ ఘుమఘుమ
తాకేనమ్మ జంట ముద్దుల్లో


4 comments:

పాటెలానూ అద్భుతమే..పిక్ టూ గుడ్..

వేటురి మాయాజాలం బ్రో
లతమంగేష్కర్ గొప్పతనం చెప్పటనకి మనం ఎంతా?
-Bhaskar Ramaraju

అవును సోదరా.. నిస్సందేహంగా.. థ్యాంక్స్ ఫర్ ద కామెంట్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.