ఒకరాధ ఇద్దరు కృష్ణులు చిత్రంలోనుండి ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : ఒక రాధ ఇద్దరు కృష్ణులు
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి
మధుర మురళి హృదయ రవళి
అధర సుధల యమున పొరలి పొంగె యద పొంగె
ఈ బృందా విహారాలలోనా నా అందాలు నీవేరా కన్నా
ఈ బృందా విహారాలలోనా నా అందాలు నీవేరా కన్నా
మధుర మురళి హృదయ రవళి
యదలు కలుపు ప్రణయ కడలి సాగే సుడి రేగే
ఈ బృందా విహారాలలోనా ఎవరున్నారు రాధమ్మ కన్నా
ఈ బృందా విహారాలలోనా ఎవరున్నారు రాధమ్మ కన్నా
గోధూళి వేళల్లో గోపెమ్మ కౌగిట్లో
లేలేత వన్నే చిన్నే దోచే వేళల్లో
పున్నాగ తోటల్లో సన్నాయి సందిట్లో
నాజూకులన్నీ నాకే దక్కేవేళల్లో
పగలో అవతారం రాత్రో శృంగారం
ఎదలో తారంగం శ్రీవారికీ
రాగాలెన్నైనా వేణువు ఒకటేలే
రూపాలెన్నైనా హృదయం ఒకటేలే
నాదే నీ గీతము ఇక నీదే ఈ సరసాల సంగీతం
మధుర మురళి హృదయ రవళి
యదలు పలకు ప్రణయ కడలి సాగే సుడిరేగే
ఈ బృందా విహారాలలోనా నా అందాలు నీవేరా కన్నా
ఈ బృందా విహారాలలోనా ఎవరున్నారు రాధమ్మ కన్నా
హేమంత వేళల్లో లేమంచు పందిట్లో
నా వీణ ఉయ్యాలూగే నీలో ఈనాడే
కార్తీక వెన్నెల్లో ఏకాంత సీమల్లో
ఆరాధనేదో సాగే అన్నీ నీవాయే
ముద్దే మందారం మనసే మకరందం
సిగ్గే సింధూరం శ్రీదేవికీ
అందాలెన్నైనా అందేదొకటేలే
ఆరూ ఋతువుల్లో ఆమని మనదేలే
పాటే అనురాగము మన బాటే
ఓ అందాల అనుబంధం
మధుర మురళి హృదయ రవళి
అధర సుధల యమున పొరలి పొంగె యద పొంగె
2 comments:
సరదా సినిమా ఇది..మొదటి నించీ చివరిదాకా నవ్వుతూనే ఉంటాము..అన్ని సాంగ్స్ బావుంటాయి..కమల్ పాడిన రాధ యెందుకింత బాధ సాంగ్ భలే ఉంటుంది..
అవును శాంతి గారు.. నాకు కూడా చాలా ఇష్టమీ సినిమా సరదా సరదాగా ఉంటుంది.. థాంక్స్ ఫర్ ద కామెంట్.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.