శనివారం, మార్చి 24, 2018

అమ్మ బ్రహ్మ దేవుడో...

గోవిందా గోవిందా చిత్రంనుండి ఒక మంచి పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : గోవిందా గోవిందా (1993)
సంగీతం : రాజ్-కోటి
గీతరచయిత : సిరివెన్నెల
గానం : బాలు, చిత్ర, మాల్గాడి శుభ

హుయ్ ఢముకెయ్ డుం డుం డిగా డిగా
సందడి సెయ్ తమాసగా అంగరంగ వైభోగంగా
సంబరం వీధుల్లో సేరి సివమెత్తంగా

హుయ్.. దరువేయ్ తధినకా
అడుగేయరా అదిలెక్కా
సామిరంగా సిందాడంగా
శీనయ్యే యేడుకొండలు దిగికిందికిరాగా

అమ్మ బ్రహ్మ దేవుడో.. కొంప ముంచినావురో
ఎంత గొప్ప సొగసురో ఏడ దాచినావురో
పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు
రంగరిస్తివో ఇలా బొమ్మ చేస్తివో
అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా
కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా

కనురెప్పలు పడనప్పుడు కల కళ్లపడదుగా
కనుకిప్పుడు ఎదరున్నది కల్లై పోదుగా
ఒహొహొ... ఒహొ ఒహో ఒహో. ఒహొహొ.. ఒహొహొ
కనురెప్పలు పడనప్పుడు కల కళ్లపడదుగా
కనుకిప్పుడు ఎదరున్నది కల్లై పోదుగా

ఒకటై సిన్నా పెద్దా అంతా చుట్టూ చేరండి…
తకథై ఆటాడించే చోద్యం చూడండి

చంద్రుళ్లో కుందేలు సందెల్లో అందాలు
మన ముంగిట్లో కథాకళి ఆడేనా

అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా
కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా
అమ్మ బ్రహ్మ దేవుడో.. అరే కొంప ముంచినావురో
ఎంత గొప్ప సొగసురో ఏడ దాచినావురో

మహ గొప్పగ మురిపించగ సరికొత్త సంగతి
తల తిప్పగ మనసొప్పక నిలిచే జాబిలి
ఒహొహొ... ఒహొ ఒహో ఒహో. ఒహొహొ.. ఒహొహొ
మహ గొప్పగ మురిపించగ సరికొత్త సంగతి
తల తిప్పగ మనసొప్పక నిలిచే జాబిలి

అప్పన్న తనామనా కధం తొక్కే పదానా
తప్పన్న తనా మనా తేడా లేవైనా

తందానా తాళానా కిందైనా మీదైనా
తలవంచేనా తెల్లారులూ తిల్లానా

హోయ్.. హోయ్.. హోయ్...
అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా
కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా
అమ్మ బ్రహ్మ దేవుడో కొంప ముంచినావురో
ఎంత గొప్ప సొగసురో ఏడ దాచినావురో
పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు
రంగరిస్తివో ఇలా బొమ్మ చేస్తివో
అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా

హుయ్ ఢముకెయ్ డుం డుం డిగా డిగా
సందడి సెయ్ తమాసగా అంగ రంగ వైభోగంగా
సంబరం వీధుల్లో సేరి సివమెత్తంగా

హుయ్.. హుయ్.. హుయ్..
దరువేయ్ తధినకా
అడుగేయరా అదిలెక్కా
సామిరంగా సిందాడంగా
శీనయ్యే యేడుకొండలు దిగికిందికిరాగా


2 comments:

"అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా
కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా"..

స్వర్గానికి చెదిన ఈ సిరి దేవిని కొన్నాళ్ళు మనమూ చూశాము..

దట్స్ ట్రూ శాంతి గారు.. థాంక్స్ ఫర్ ద కామెంట్..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.