గురువారం, మార్చి 01, 2018

బూచాడమ్మా...బూచాడు...

అశేషమైన అభిమానులకు తన జ్ఞాపకాలను మాత్రం మిగిల్చి అనంతలోకాలకు పయనమైన శ్రీదేవికి నివాళిగా ఈ మార్చ్ నెలంతా తన పాటలు తలచుకుందాం. ముందుగా బడిపంతులు చిత్రంలోని ఈ పాట. ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.

చిత్రం : బడి పంతులు (1972)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : ఆత్రేయ
గానం : సుశీల

బూచాడమ్మా...బూచాడు...బుల్లి పెట్టె లో వున్నాడు...
బూచాడమ్మా...బూచాడు...బుల్లి పెట్టె లో వున్నాడు
కళ్ళకెపుడు కనపడడు కబురులెన్నో చెపుతాడు

బూచాడమ్మా...బూచాడు...బుల్లి పెట్టె లో వున్నాడు...
బూచాడమ్మా...బూచాడు...బుల్లి పెట్టె లో వున్నాడు
కళ్ళకెపుడు కనపడడు కబురులెన్నో చెపుతాడు
బూచాడమ్మా...బూచాడు...బుల్లి పెట్టె లో వున్నాడు...

గుర్ గుర్ మంటూ గోలెడతాడు.. హెల్లో అని మొదలెడతాడూ...
గుర్ గుర్ మంటూ గోలెడతాడు.. హెల్లో అని మొదలెడతాడూ...
ఎక్కడ వున్న ఎవ్వరినైనా.. ఎక్కడ వున్న ఎవ్వరినైనా..
పలుకరించి కలుపుతాడు...

బూచాడమ్మా...బూచాడు...బుల్లి పెట్టె లో వున్నాడు...
బూచాడమ్మా...బూచాడు...బుల్లి పెట్టె లో వున్నాడు
కళ్ళకెపుడు కనపడడు కబురులెన్నో చెపుతాడు
బూచాడమ్మా...బూచాడు...బుల్లి పెట్టె లో వున్నాడు...

తెలుగు తమిళ హిందీ కన్నడ భాషా భేధాలెరుగని వాడూ
తెలుగు తమిళ హిందీ కన్నడ భాషా భేధాలెరుగని వాడూ
కులము మతము జాతేదైనా... కులము మతము జాతేదైనా ..
గుండెలు గొంతులు ఒకటంటాడు

బూచాడమ్మా...బూచాడు...బుల్లి పెట్టె లో వున్నాడు...

డిల్లీ మద్రాస్ హైద్రాబాద్ రష్యా అమెరికా లండన్ జపాన్
ఎక్కడికైనా వెళుతుంటాడు ఎల్లలు మనసుకు లేవంటాడు..
ఎక్కడికైనా వెళుతుంటాడు ఎల్లలు మనసుకు లేవంటాడు..
ఒకే తీగ పై నడిపిస్తాడు... ఒకే ప్రపంచం అనిపిస్తాడు...

బూచాడమ్మా...బూచాడు...బుల్లి పెట్టె లో వున్నాడు...
బూచాడమ్మా...బూచాడు...బుల్లి పెట్టె లో వున్నాడు
కళ్ళకెపుడు కనపడడు కబురులెన్నో చెపుతాడు
బూచాడమ్మా...బూచాడు...బుల్లి పెట్టె లో వున్నాడు.

5 comments:

భాషేదైనా..శ్రీదేవి తను నటించిన ప్రతీ భాషలో టాప్ హీరోయిన్ అనిపించుకుంది..విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు అదర్ హీరో, హీరోయిన్ ఫాన్స్..తెలుగులొ యన్.టి.ఆర్ టు జూనియర్ యన్.టి.ఆర్..తమిళ్ లో యం.జి.ఆర్ టు విజయ్..హింది లో అమితాబ్ టు రన్వీర్ సింగ్..యెవ్వరూ సాధించని ట్రాక్ రికార్డ్ ఆమె సొంతం..అందుకే రాఘవేంద్ర రావ్ గారు అన్నట్టు శ్రీదేవి యూనివర్సల్ స్టార్..మే హెర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్..

We willl send this MARVELLOUS song to others, if there is E-Mail Provision .

నిజం శాంతి గారు ఇన్ని భాషల్లో టాప్ హీరోయిన్ గా కొనసాగడం కేవలం తనకే సాధ్యమైంది. థాంక్స్ ఫర్ ద కామెంట్.

వి.వి.సత్యన్నారాయణ గారు ఆ ఆప్షన్ గురించి ఎపుడూ ఆలోచించలేదండీ మంచి ఐడియా.. చెక్ చేసి త్వరలో ఈమెయిల్ పోస్ట్ ఆప్షన్ పెడతాను.

సత్యన్నారాయణ గారూ.. షేర్ బటన్ యాడ్ చేశానండీ.. కింద కుడివైపు ఉన్న రెడ్ ఫార్వర్డ్ బటన్ క్లిక్ చేస్తే మీకు ఈమెయిల్ షేర్ ఆప్షన్ కనిపిస్తుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.