క్షణ క్షణం చిత్రంలోని ఓ అద్భుతమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : క్షణం క్షణం (1991)
సంగీతం : కీరవాణి
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు, చిత్ర
జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా
జోరుగాలిలో జాజికొమ్మ జారనియ్యకే కలా
వయ్యారి వాలు కళ్ళలోనా వరాల వెండిపూల వాన
స్వరాల ఊయలూగు వేళ
జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా
కుహు కుహు సరాగాలే శృతులుగా
కుశలమా అనే స్నేహం పిలువగా
కిల కిల సమీపించే సడులతో
ప్రతి పొద పదాలేవో పలుకగా
కునుకు రాక బుట్టబొమ్మ గుబులుగుందనీ
వనము లేచి వద్దకొచ్చి నిద్ర పుచ్చనీ
జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా
మనసులో భయాలన్నీ మరిచిపో
మగతలో మరో లోకం తెరుచుకో
కలలతో ఉషాతీరం వెతుకుతూ
నిదరతో నిషారానే నడిచిపో
చిటికలోన చిక్కబడ్డ కటిక చీకటి
కరిగిపోక తప్పదమ్మ ఉదయకాంతికి
జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా
జోరుగాలిలో జాజికొమ్మ జారనియ్యకే కలా
వయ్యారి వాలు కళ్ళలోనా
సంగీతం : కీరవాణి
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు, చిత్ర
జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా
జోరుగాలిలో జాజికొమ్మ జారనియ్యకే కలా
వయ్యారి వాలు కళ్ళలోనా వరాల వెండిపూల వాన
స్వరాల ఊయలూగు వేళ
జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా
కుహు కుహు సరాగాలే శృతులుగా
కుశలమా అనే స్నేహం పిలువగా
కిల కిల సమీపించే సడులతో
ప్రతి పొద పదాలేవో పలుకగా
కునుకు రాక బుట్టబొమ్మ గుబులుగుందనీ
వనము లేచి వద్దకొచ్చి నిద్ర పుచ్చనీ
జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా
మనసులో భయాలన్నీ మరిచిపో
మగతలో మరో లోకం తెరుచుకో
కలలతో ఉషాతీరం వెతుకుతూ
నిదరతో నిషారానే నడిచిపో
చిటికలోన చిక్కబడ్డ కటిక చీకటి
కరిగిపోక తప్పదమ్మ ఉదయకాంతికి
జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా
జోరుగాలిలో జాజికొమ్మ జారనియ్యకే కలా
వయ్యారి వాలు కళ్ళలోనా
ఊఊఊహ్.హ్.హ్. ఆహ
స్వరాల ఊయలూగు వేళ
స్వరాల ఊయలూగు వేళ
2 comments:
ఈ అందాలరాశికి దేవుడే జోల పాట పాడాడు కదండీ..
హ్మ్... అవును శాంతి గారు... థాంక్స్ ఫర్ ద కామెంట్..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.