అనురాగదేవత చిత్రం కోసం చక్రవర్తి గారు స్వరపరచిన ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : అనురాగదేవత (1982)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : వేటూరి
గానం : సుశీల
ఆ..ఆ..ఆ..ఆఅ..ఆ.ఆఅ..
ఆ హో... ఆ హో...
చూసుకో పదిలంగా... హృదయాన్ని అద్దంలా
చూసుకో పదిలంగా... హృదయాన్ని అద్దంలా
పగిలేది ఖాయం ఏదైనా.. రగిలేను నీలో వేదన
చూసుకో పదిలంగా..ఆ..ఆ
వికసించే పూలు ముళ్ళు.. విధి రాతకు ఆనవాళ్ళూ
వికసించే పూలు ముళ్ళు.. విధి రాతకు ఆనవాళ్ళూ
ఒకరి కంట పన్నీరైనా..ఒకరి కంట కన్నీళ్ళు
ఒకరి కంట పన్నీరైనా..ఆ..ఆ ఒకరి కంట కన్నీళ్ళు
ఎండమావి నీరు తాగి.. గుండె మంటలార్చుకోకు
ఎండమావి నీరు తాగి.. గుండె మంటలార్చుకోకు
ఆశ పెంచుకోకు నేస్తం.. అది నిరాశ స్వాగత హస్తం
చూసుకో పది లంగా... హృదయాన్ని అద్దంలా
పగిలేది ఖాయం ఏదైనా.. రగిలేను నీలో వేదన
చూసుకో పదిలంగా..ఆ..ఆ
కాలమనే నదిలో కదిలే.. కర్మమనే నావ మీద
కాలమనే నదిలో కదిలే.. కర్మమనే నావ మీద
ఎవరి తోడు ఎన్నాళ్ళున్నా.. చివరి తోడు నువ్వేలే
ఎవరి తోడు ఎన్నాళ్ళున్నా.. చివరి తోడు నువ్వేలే
సాగుతున్న బాటసారి.. ఆగి చూడు ఒక్కసారి
సాగుతున్న బాటసారి.. ఆగి చూడు ఒక్కసారి
కలుసుకోనీ ఇరు తీరాలూ..
కనిపించని సుడిగుండాలు
చూసుకో పదిలంగా.. హృదయాన్ని అద్దంలా
పగిలేది ఖాయం ఏదైనా.. రగిలేను నీలో వేదన
చూసుకో పదిలంగా..ఆ..ఆ
2 comments:
అమ్మాయి హృదయం నిజంగా అద్దం లాంటిదే..
థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతిగారు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.