మిత్రులందరకూ శ్రీరామనవమి శుభాకాంక్షలు... శ్రీరామరాజ్యంలోని ఈ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ.
చిత్రం : శ్రీరామ రాజ్యం (2011)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : జొన్నవిత్తుల
గానం : రాము ,శ్రేయా ఘోషల్
శ్రీ రామా లేరా ఓ రామా
ఇలలో పెనుచీకటి మాపగ రా
సీతారామచూపేయ్ నీ మహిమ
మదిలో అసురాలిని మాపగ రా
మదమత్సర క్రోదములే మా నుంచి తొలగించి
సుగుణాలను కలిగించి హృదయాలను వెలిగించి
మా జన్మము ధన్యము చేయుము రా..రా..
శ్రీ రామా లేరా ఓ రామా
ఇలలో పెనుచీకటి మాపగ రా రా
ఆఆ..దరిశనమును కోర దరికే చేరే
దయగల మా రాజు దాశరధి
తొలుతనే ఎదురేగి కుశలములడిగీ
హితమును గావించే ప్రియ వాది
ధీరమతియై న్యాయపతి అయి ఏలు రఘుపతియే
ప్రేమ స్వరమై స్నేహకరమై మేలు వొసగునులే
అందరు ఒకటేలే రామునికి ఆదరమొకటేలే
సకల గుణ ధామును రీతిని
రాముని నీతిని ఏమని పొగడుదులే
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : జొన్నవిత్తుల
గానం : రాము ,శ్రేయా ఘోషల్
శ్రీ రామా లేరా ఓ రామా
ఇలలో పెనుచీకటి మాపగ రా
సీతారామచూపేయ్ నీ మహిమ
మదిలో అసురాలిని మాపగ రా
మదమత్సర క్రోదములే మా నుంచి తొలగించి
సుగుణాలను కలిగించి హృదయాలను వెలిగించి
మా జన్మము ధన్యము చేయుము రా..రా..
శ్రీ రామా లేరా ఓ రామా
ఇలలో పెనుచీకటి మాపగ రా రా
ఆఆ..దరిశనమును కోర దరికే చేరే
దయగల మా రాజు దాశరధి
తొలుతనే ఎదురేగి కుశలములడిగీ
హితమును గావించే ప్రియ వాది
ధీరమతియై న్యాయపతి అయి ఏలు రఘుపతియే
ప్రేమ స్వరమై స్నేహకరమై మేలు వొసగునులే
అందరు ఒకటేలే రామునికి ఆదరమొకటేలే
సకల గుణ ధామును రీతిని
రాముని నీతిని ఏమని పొగడుదులే
మా శ్రీ రామా లేరా ఓ రామా
ఇలలో పెనుచీకటి మాపగ రా
తాంబుల రాగల ప్రేమామృతం
తమకించి సేవించు తరుణం
శృంగార శ్రీరామ చంద్రోదయం
ప్రతీరేయి వైదేహి హృదయం
మౌనం కూడా మధురం..
సమయం అంతా సఫలం..
ఇది రామ ప్రేమలోకం ...
ఇలా సాగిపోవు స్నేహం
ఇందులోని మోక్షం
ఇందులోని మోక్షం
రవి చంద్రులింక సాక్షం
ఏనాడు వీడిపోని బంధం ..ఆఅ
ఏనాడు వీడిపోని బంధం ..ఆఅ
శ్రీ రామ రామ రఘురామా
పిలిచే సమ్మోహన సుస్వరామా
సీతాభామా ప్రేమారాధానామా
హరికే హరి చందన బంధనమా
శ్రీరాముని అనురాగం సీతా సతి వైభోగం
శ్రీరాముడు రసవేదం శ్రీ జానకి అనువాదం
ఏనాడు వీడిపోని బంధము.
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
ఈ రోజు శ్రీదేవి పాటలలో భాగంగా చిలిపిమొగుడు చిత్రంలోని ఒక అందమైన పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. .
చిత్రం : చిలిపిమొగుడు (1981)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : రాజశ్రీ
గానం : బాలు, సుశీల
నిన్న సంధ్య వేళ కలల సందడి తోచెనులే
మల్లెల గుండెలలో ఎవరో పల్లవి పాడెనులే
తలపే బంధము కోరెనులే ..
ముచ్చటలూరించే కోటీ ముద్దుల మురిపించే..
ముచ్చటలూరించే కోటీ ముద్దుల మురిపించే..
తేనెల తేలించే ఎదలో రాగం పల్లవించే
ఊహల వయ్యారం నన్నొక బొమ్మగ ఊగించే ..
ఆశలు పండించే నాలో యవ్వనమూరించే
నిన్న సంధ్య వేళ కలలో సందడి తోచెనులే
మల్లెల గుండెలలో ఎవరో పల్లవి పాడెనులే..
తలపే బంధము కోరెనులే
పట్టు పైట తొలిగి మదిలో వేడుక పూరించే
పడచుదనం వగలై తెలిపే భావం పలకరించే..
అల్లరి నా మనసే చెలికి అల్లన విన్నవించే..
మోజులు వెన్నెలగా.. మోజులు వెన్నెలగా..
నిలిపే ఊహుహుఊహుహుహూ..
నిన్న సంధ్య వేళ కలలో సందడి తోచెనులే
మల్లెల గుండెలలో ఎవరో పల్లవి పాడెనులే
తలపే బంధము కోరెనులే..
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : రాజశ్రీ
గానం : బాలు, సుశీల
నిన్న సంధ్య వేళ కలల సందడి తోచెనులే
మల్లెల గుండెలలో ఎవరో పల్లవి పాడెనులే
తలపే బంధము కోరెనులే ..
ముచ్చటలూరించే కోటీ ముద్దుల మురిపించే..
ముచ్చటలూరించే కోటీ ముద్దుల మురిపించే..
తేనెల తేలించే ఎదలో రాగం పల్లవించే
ఊహల వయ్యారం నన్నొక బొమ్మగ ఊగించే ..
ఆశలు పండించే నాలో యవ్వనమూరించే
నిన్న సంధ్య వేళ కలలో సందడి తోచెనులే
మల్లెల గుండెలలో ఎవరో పల్లవి పాడెనులే..
తలపే బంధము కోరెనులే
పట్టు పైట తొలిగి మదిలో వేడుక పూరించే
పడచుదనం వగలై తెలిపే భావం పలకరించే..
అల్లరి నా మనసే చెలికి అల్లన విన్నవించే..
మోజులు వెన్నెలగా.. మోజులు వెన్నెలగా..
నిలిపే ఊహుహుఊహుహుహూ..
నిన్న సంధ్య వేళ కలలో సందడి తోచెనులే
మల్లెల గుండెలలో ఎవరో పల్లవి పాడెనులే
తలపే బంధము కోరెనులే..
2 comments:
మీకూ..మీ కుటుంబ సభ్యులకి శ్రీరామనవమి శుభాకాంక్షలు వేణూజీ..
థాంక్స్ శాంతి గారు మీకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు :-)
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.