మంగళవారం, మార్చి 13, 2018

నీ కన్నులలోనా...

ధర్మయుద్ధం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ధర్మయుద్ధం (1979)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : రాజశ్రీ
గానం : బాలు, జానకి

నీ కన్నులలోనా మురిసే మదిలోన
కురిసే విరివాన మల్లెల రాశీ పల్లవి చేసీ
పలికెనే పరవశం కలిగెనే సంగమం

ఊహలు రేగే రాగాలను రేపే
నీగాధలూ తెల్పే అల్లరిచేసే ఆశలు కలిసే
బంధమే పరవశం అందమే సంగమం


కదలి ఆడే హే.హే.. మౌన రాగం.. ఓఓఓ
కదలి ఆడే హే.హే.. మౌన రాగం.. ఆఆఆ
కలలుగా విరిసెనే మదిలో మధుమాసం
మనసెందుకో ఓఓఓ పులకించేనే
మధువులు చిలికేనే పరువం ఓ చెలిమి

మృధుమధురం ఈ సమయం
నీ చెంత ఇది స్వర్గమో

ఊహలు రేగే రాగాలను రేపే
నీగాధలూ తెల్పే
మల్లెల రాశీ పల్లవి చేసీ
పలికెనే పరవశం కలిగెనే సంగమం

జీవితాంతం.. హేహేహే..  సాగిపోదాం.. ఓఓఓ
జీవితాంతం.. హేహేహే..  సాగిపోదాం.. ఓఓఓ
తోడుగా నీడగా జతగా మన స్నేహం
చెలిగుండెలో ఓఓఓ.. ఈ వేళలో
తలపులు విరియాలి మనసే నిండాలి
అలలాగా నా మదిలో చెలరేగే తొలిమోహం

నీ కన్నులలోనా మురిసే మదిలోన
కురిసే విరివాన అల్లరిచేసే ఆశలు కలిసే
బంధమే పరవశం అందమే సంగమం

లలలల లాలాల లాలలా లాలలా..  


2 comments:

ఈ పాట నాకు చాలా ఇష్టమైనది..ఐతే ఇంతవరకూ యే మూవీ లోదో తెలీదు..థాంక్స్ ఫర్ పోస్టింగ్..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.