ఆదివారం, మార్చి 11, 2018

పెళ్ళంటె పందిళ్ళు...

త్రిశూలం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : త్రిశూలం (1982)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : ఆత్రేయ
గానం : బాలు, సుశీల

ఆఆఆఆఆ..... ఆఆఆఆఆఅ.....

పెళ్ళంటే...

పెళ్ళంటె పందిళ్ళు.. సందళ్ళు తప్పెట్లు..
తాళాలు తలంబ్రాలూ
మూడే ముళ్ళు.. ఏడే అడుగులు..
మొత్తం కలిసీ నూరేళ్ళు

ఆ...ఆ...ఆ...ఆ.....

పెళ్ళంటె పందిళ్ళు.. సందళ్ళు తప్పెట్లు..
తాళాలు తలంబ్రాలూ
మూడే ముళ్ళు.. ఏడే అడుగులు..
మొత్తం కలిసీ నూరేళ్ళు

పెళ్ళైతే...

పెళ్ళైతె ముంగిళ్ళు.. లోగిళ్ళు ముగ్గులు..
ముత్తైదు భాగ్యాలూ....
ముద్దూ ముచ్చట్లు.. మురిసే లోగుట్లు..
చెలిమికి సంకెళ్ళు వెయ్యేళ్ళు..
ఆ...ఆ...ఆ...ఆ.....


పెళ్ళైతె ముంగిళ్ళు.. లోగిళ్ళు ముగ్గులు
ముత్తైదు భాగ్యాలూ....

మ్మ్..మ్మ్...మ్మ్...

గోదారి ఒడ్డున.. గోగుల్లు పూచిన వెన్నెలలో
కొసరాడు కోర్కెలు.. చెరలాడు కన్నుల సైగలలో
ఆ ఆ.. గోదారి ఒడ్డున.. గోగుల్లు పూచిన వెన్నెలలో
కొసరాడు కోర్కెలు.. చెరలాడు కన్నుల సైగలలో

మమతానురాగాల మరుమల్లెలల్లిన పానుపులూ...
హృదయాలు పెదవుల్లో.. ఎరుపెక్కు ఏకాంత వేళల్లో
వలపు పులకింతలో.. వయసు గిలిగింతలో..
వింతైన సొగసుల వేడుకలో..
ఆ...ఆ...ఆ...ఆ.....

పెళ్ళంటె పందిళ్ళు.. సందళ్ళు తప్పెట్లు..
తాళాలు తలంబ్రాలూ...
మూడే ముళ్ళు.. ఏడే అడుగులు..
మొత్తం కలిసీ నూరేళ్ళు

ఆ...ఆ...ఆ...ఆ.....


పెళ్ళంటె పందిళ్ళు.. సందళ్ళు తప్పెట్లు..
తాళాలు తలంబ్రాలూ..
ఆ.....

కలలన్ని కలబోసి.. వెలసిన ఈ పంచవటిలో
ఇల్లాలు నేనై.. ఇలవేల్పు నీవైన కోవెలలో
ఆ... కలలన్ని కలబోసి.. వెలసిన ఈ పంచవటిలో
ఇల్లాలు నేనై.. ఇలవేల్పు నీవైన కోవెలలో

సిరిమువ్వ రవళుల మరిపించు నీ నవ్వు సవ్వడిలో...
కులమన్నదే లేని అలనాటి వేదాల ఒరవడిలో
సామగానాలము.. సరసరాగాలము
ప్రేమికులమన్న కులమున్న లోకంలో
ఆ..ఆ..ఆ..ఆ...

పెళ్ళంటె పందిళ్ళు.. సందళ్ళు తప్పెట్లు..
తాళాలు తలంబ్రాలూ

మూడే ముళ్ళు.. ఏడే అడుగులు..
మొత్తం కలిసీ నూరేళ్ళు

ఆ...ఆ...ఆ...ఆ.....

పెళ్ళంటె పందిళ్ళు.. సందళ్ళు తప్పెట్లు..
తాళాలు తలంబ్రాలూ....
ఆ..... ఆ..... ఆ....
 


2 comments:

ఫ్లాష్ బాక్ లో ఈ మూవీలోని ఈ పాట, రాయిని ఆడది చేసిన రామునివా పాటా విపరీతం గా వినిపించేవండి యెందుకో మరి..

అవి అంత సూపర్ హిట్ సాంగ్స్ కదండీ మరి.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.