బుధవారం, మార్చి 28, 2018

అబ్బనీ తియ్యనీ దెబ్బ...

జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : జగదేకవీరుడు అతిలోకసుందరి (1990)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి

అబ్బనీ తియ్యనీ దెబ్బ ఎంత కమ్మగా ఉందిరోయబ్బా
అమ్మనీ నున్ననీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ
అబ్బనీ తీయనీ దెబ్బ ఎంత కమ్మగా ఉందిరోయబ్బా
వయ్యారాల వెల్లువ వాటేస్తుంటే వారెవా
పురుషుల్లోనా పుంగవా పులకింతొస్తే ఆగవా
అబ్బనీ తియ్యనీ దెబ్బ ఎంత కమ్మగా ఉందిరోయబ్బా
అమ్మనీ నున్ననీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ

చిటపట నడుముల ఊపులో ఒక ఇరుసున వరసలు కలవగా
ముసిరిన కసికసి వయసులో ఒక ఎదనస పదనిస కలవగా
కాదంటూనే కలబడు అది లేదంటూనే ముడిపడు
ఏమంటున్నా మదనుడు తెగ ప్రేమించాక వదలడు
చూస్తా సొగసు కోస్తా వయసు నిలబడు కౌగిట

అబ్బనీ తీయనీ దెబ్బ ఎంత కమ్మగా ఉందిరోయబ్బా
వయ్యారాల వెల్లువ వాటేస్తుంటే వారెవా
పురుషుల్లోనా పుంగవా పులకింతొస్తే ఆగవా
అబ్బనీ తియ్యనీ దెబ్బ ఎంత కమ్మగా ఉందిరోయబ్బా
అమ్మనీ నున్ననీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గాఆఁ...
 
అడగక అడిగినదేవిఁటో లిపి చిలిపిగ ముదిరిన కవితగా
అది విని అదిమిన షోకులో పురి విడిచిన నెమలికి సవతిగా
నిన్నే నావి పెదవులు అవి నేడైనాయి మధువులు 
రెండున్నాయి తనువులు అవి రేపవ్వాలి మనువులు
వస్తా వలచి వస్తా మనకు ముదిరెను ముచ్చట
 
అబ్బనీ తీయనీ దెబ్బ ఎంత కమ్మగా ఉందిరోయబ్బా
వయ్యారాల వెల్లువ వాటేస్తుంటే వారెవా
పురుషుల్లోనా పుంగవా పులకింతొస్తే ఆగవా
అబ్బనీ తియ్యనీ దెబ్బ ఎంత కమ్మగా ఉందిరోయబ్బా
అమ్మనీ నున్ననీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ




4 comments:

యెవ్వర్ గ్రీన్ హిట్ సాంగ్..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

వేటూరి బుచికి లిరిక్స్. పాట మాత్రం అదుర్స్.

థాంక్స్ అజ్ఞాత గారూ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.