మంగళవారం, మార్చి 20, 2018

వెన్నెలైనా.. చీకటైనా..

పచ్చని కాపురం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : పచ్చని కాపురం (1985)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : సినారె
గానం : ఏసుదాస్, జానకి

ఆ..ఆ..ఆ..
వెన్నెలైనా.. చీకటైనా.. చేరువైనా.. దూరమైనా
నీతోనే జీవితము.. నీ ప్రేమే శాశ్వతము
ఏ జన్మదో ఈ బంధము.. ఏ జన్మదో ఈ బంధము
నింగి నేల సాక్ష్యాలు.. నింగి నేల సాక్ష్యాలు
ప్రేమకు మనమే తీరాలు

వెన్నెలైనా.. చీకటైనా.. చేరువైనా.. దూరమైనా
నీతోనే జీవితము.. నీ ప్రేమే శాశ్వతము

జ్ఞాపకమేదో.. నీడల్లె తారాడే..
స్వప్నాలేవో.. నీ కళ్ళ దోగాడే
కౌగిలింతలోన గాలి ఆడకూడదు..
చుక్కలైన నిన్ను నన్ను చూడకూడదు

నీ సర్వమూ.. నాదైనదీ..
నేను దేహమల్లె.. నీవు ప్రాణమల్లె
ఏకమైన రాసలీలలోనా..

వెన్నెలైనా.. చీకటైనా.. చేరువైనా.. దూరమైనా

అంతంలేనీ.. నీ రాగ బంధంలో..
అంచున నిలిచీ.. నీ వైపే చూస్తున్నా

పున్నమింట కట్టుకున్న పూలడోలలు..
ఎన్నడింక చెప్పవమ్మ బాలసారలు
ఆ ముద్దులే.. మూడైనవీ..
బాలచంద్రుడొస్తే.. నూలుపోగులిస్తా..
ఇంటి దీపమయ్యేదింకా ప్రేమా


వెన్నెలైనా.. చీకటైనా.. చేరువైనా.. దూరమైనా
నీతోనే జీవితము.. నీ ప్రేమే శాశ్వతము
ఏ జన్మదో ఈ బంధము.. ఏ జన్మదో ఈ బంధము
నింగి నేల సాక్ష్యాలు.. నింగి నేల సాక్ష్యాలు
ప్రేమకు మనమే తీరాలు.. 

 

2 comments:

ఈ పాట చాలా నచ్చినా..యేసుదాస్ గారి పాటగా మనసులో రిజస్టర్ కాలేదు..

ఆయన స్వరం రిజిస్టర్ కాలేదంటే ఆశ్చర్యమేనండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.